Begin typing your search above and press return to search.

వామ్మో శ్రీలీల… ఒకేసారి ఇవన్నీ ఎలా?

అయితే శ్రీలీల మాత్రం నవంబర్, డిసెంబర్ రెండు నెలలు పూర్తిగా సినిమాలకి బ్రేక్ ఇచ్చి ప్రిపరేషన్ మోడ్ లోకి వచ్చేస్తుందంట.

By:  Tupaki Desk   |   22 Aug 2023 4:13 AM GMT
వామ్మో శ్రీలీల… ఒకేసారి ఇవన్నీ ఎలా?
X

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. ఈ అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు స్టార్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సెట్స్ పైన ఉన్నాయి. రామ్ తో చేసిన స్కంద మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. వైష్ణవ్ తేజ్ తో చేసిన ఆదికేశవ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రా మూవీ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. త్వరలో వెంకి కుడుములు దర్శకత్వంలో మూవీని నితిన్ సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు. ఈ చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్. ఇవి కాకుండా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతోన్న VD 12లో కూడా శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది.

బాలయ్యతో చేస్తోన్న భగవంత్ కేసరి అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఇలా చేతినిండా 8 నుంచి 10 సినిమాల వరకు ఉన్నాయి. అన్నింటికీ డేట్స్ ఇచ్చేసింది. వీటిని బ్యాలెన్స్డ్ గా హ్యాండిల్ చేసుకుంటూ కెరియర్ ని స్ట్రాంగ్ గా ఈ బ్యూటీ బిల్డ్ చేసుకుంటుంది. అయితే ఇలా వరుస ప్రాజెక్ట్స్ మధ్యలో రెండు నెలల గ్యాప్ తీసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుందా అంటే కష్టం అనే అంటారు.

అయితే శ్రీలీల మాత్రం నవంబర్, డిసెంబర్ రెండు నెలలు పూర్తిగా సినిమాలకి బ్రేక్ ఇచ్చి ప్రిపరేషన్ మోడ్ లోకి వచ్చేస్తుందంట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎంబీబీఎస్ చదువుతోంది. ఈ ఏడాదితో పూర్తికానుంది. అందుకే పరీక్షల కోసం రెండు నెలలు సమయం కేటాయించి ప్రిపేర్ అవుతుందంటే. ఈ బ్యూటీ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాకుండా చదువుల్లో కూడా టాపర్ అని తెలుస్తోంది.

అలాగే నాలుగు, ఐదు భాషలు సునాయాసంగా మాట్లాడేస్తుంది. మంచి సింగర్ కూడా శ్రీలీలలో ఉంది. ఎలా మల్టీ టాలెంటెడ్ గర్ల్ గా ఉన్న శ్రీలీల ఇన్ని సినిమాలు చేస్తూ కూడా రెండు నెలలు గ్యాప్ తీసుకోవడం చూస్తుంటే అమ్మడు కేపబిలిటీకి అందరూ షాక్ అవుతున్నారని చెప్పాలి. వీటిని ఎలా హ్యాండిల్ చేస్తుందో అని ఆశ్చర్యానికి గురవుతున్నారు.