Begin typing your search above and press return to search.

నెలకొ సినిమా.. కష్టాలు చెప్పుకున్న శ్రీలీల

అయితే నెలకు ఒక సినిమాతో నెక్స్ట్ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ బ్యూటీ మాత్రం చాలా ఒత్తిడినే తట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 Oct 2023 1:30 AM GMT
నెలకొ సినిమా.. కష్టాలు చెప్పుకున్న శ్రీలీల
X

గ్లామరస్ బ్యూటీ శ్రీలీల ఏ మాయ చేసిందో కానీ మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసును దోచుకున్న విధానం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె డేట్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక డిమాండ్ ను బట్టి మొదటి సినిమా తర్వాత ఈజీగా కోటి రూపాయల పారిపోషకం అందుకుంటోంది. ఇక ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

ఇక ప్రస్తుతం అయితే అమ్మడి టైమ్ గట్టిగా నడుస్తుంది అని చెప్పవచ్చు. ఎవరికీ లేనన్ని ఆఫర్లు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలకు దక్కుతున్నాయి. అగ్ర హీరోలు మాత్రమే కాకుండా చిన్న హీరోలు కూడా ఈ బ్యూటీతో జోడి కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదిలో అయితే ఆమెకు అసలు గ్యాప్ లేకుండా ఆఫర్స్ వస్తున్నాయి.

ఇక శ్రీలీల కూడా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. బాలయ్యతో చేసిన భగవంథ్ కేసరి సినిమా రాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. స్కంద సినిమాతో కాస్త నిరాశపరచినప్పటికీ కూడా ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి రావాలి అని అనుకుంటుంది. ఇక రాబోయే రోజుల్లో అమ్మడు ఆది కేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్, గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రాజు.. అనే సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే నెలకు ఒక సినిమాతో నెక్స్ట్ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ బ్యూటీ మాత్రం చాలా ఒత్తిడినే తట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రస్తుతం తన పరిస్థితి గురించి ఊహించిన విధంగానే తెలియజేసింది. మీరు నటించిన సినిమా నెలకొకటి రిలీజ్ అవుతుంది. ఇది రేర్ రికార్డ్ కదా.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

"ఎంజాయ్ చేస్తున్నానా? మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకేం తెలుసు. ఒకపక్క షూటింగ్ ఇంకో పక్క డబ్బింగ్ అలాగే మరో వైపు సాంగ్స్ షూట్ చేయాలి. నా పరిస్థితి మామూలుగా లేదు. ఇక బాలయ్య గారు వాళ్ళ నాన్న ఎన్టీఆర్ గురించి చెప్పారు.

ఒక టైంలో ఎన్ని సినిమాలు చేసేవారో తెలుసుకున్నాను. ఇక వాళ్లతో పోలిస్తే మనం చేసేది నథింగ్ అనిపించింది. ఇక ఒకేసారి అన్ని సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. అందుకు లైన్ గా రిలీజ్ లు ఉంటున్నాయి.. అంతే.." అని శ్రీలీల వివరణ ఇచ్చింది.