Begin typing your search above and press return to search.

శ్రీ‌లీల మ‌యూర భంగిమ‌

శ్రీ‌లీల నాట్య‌మాడితే మ‌యూరం పురి విప్పి ఆడిన‌ట్టు ఉంటుంది. అంత అందంగా నాట్యం చేయ‌గ‌ల ప్ర‌తిభావ‌ని.

By:  Tupaki Desk   |   13 April 2025 9:22 AM IST
శ్రీ‌లీల మ‌యూర భంగిమ‌
X

శ్రీ‌లీల నాట్య‌మాడితే మ‌యూరం పురి విప్పి ఆడిన‌ట్టు ఉంటుంది. అంత అందంగా నాట్యం చేయ‌గ‌ల ప్ర‌తిభావ‌ని. మాస్ డ్యాన్స్ క్లాస్ డ్యాన్స్ క‌ల‌గ‌లిపి ఉర్రూత‌లూగించ‌గ‌ల‌ స‌మ‌ర్థురాలు. అందుకే బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా అవ‌కాశాలొస్తున్నాయి.

ఈ బ్యూటీ తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటోగ్రాప్ ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఇందులో ప‌సుపు రంగు చీర‌లో క‌నిపించిన శ్రీ‌లీల నాభి సొగ‌సును ఆవిష్క‌రిస్తూ హొయ‌లు పోతోంది. అలా విర‌హంగా ఒళ్లు విరుచుకుంటున్న భంగిమ‌లో ఎంతో హా* గా క‌నిపిస్తోంది. మ‌యూరం పురి విప్పిన‌ట్టుగా ఉంది భంగిమ‌! అంటూ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప‌సుపు రంగు చీర ర‌వికెలో శ్రీ‌లీల ఎంతో అందంగా క‌నిపిస్తోంది.

బాలీవుడ్ లో కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తున్న శ్రీలీల తెలుగులోను ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. బాలీవుడ్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉండ‌గానే యువ‌హీరో కార్తీక్ ఆర్య‌న్ తో శ్రీ‌లీల డేటింగ్ చేస్తోందంటూ ప్ర‌చారం సాగుతోంది. ఆ ఇద్ద‌రూ జంట‌గా ఉన్న ఫోటోల‌ను అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ ఆషిఖి ఫ్లేవ‌ర్ తో పార్ట్ 3 తెర‌కెక్కిస్తున్నార‌ని అభిమానులు భావిస్తున్నా కానీ, పూర్తిగా కొత్త క‌థ‌తో రూపొందిస్తున్నామ‌ని ఆషిఖి మేక‌ర్స్ వెల్ల‌డించారు.