అమ్మమ్మని వైరల్ వయ్యారిని చేసేలా!
తాజాగా ఈ పాటకు సంబంధించిన డిస్కషన్ శ్రీలీల ఇంట్లో జరిగింది. శ్రీలీల కింద కుర్చుని అమ్మమ్మ నిన్ను అంతా వైరల్ వయ్యారి?
By: Tupaki Desk | 18 July 2025 5:03 PM ISTతెలుగు హీరోయిన్ శ్రీలీల ప్రయివేట్ వీడియోలు నెట్టింట ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో చెప్పాల్సిన పనిలేదు. అమ్మతో ...అమ్మమ్మతో కలిసి చేసిన వీడియోలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ నేచురల్ వీడియోస్. `జూనియర్` చిత్రంలో వైరల్ వయ్యారి పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. శ్రీలీల--కిరిటీ డాన్సులకు నెటి జనులు ఫిదా అయ్యారు. ఈపాటలో ఇద్దరు పోటీపో టీగా డాన్సులతో అలరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
తాజాగా ఈ పాటకు సంబంధించిన డిస్కషన్ శ్రీలీల ఇంట్లో జరిగింది. శ్రీలీల కింద కుర్చుని అమ్మమ్మ నిన్ను అంతా వైరల్ వయ్యారి? అంటున్నారని అంటే? అమ్మమ్మ తెగ మురిసిపోయింది. నన్ను ఎందుకు అంటారు..నిన్నే అంటారంటూ మనవరాలిపై అమ్మమ్మ గుసాయిస్తుంటే? శ్రీలీల పగలబడి నవ్వుతుంది. శ్రీలీల మళ్లీ మళ్లీ అదే మాట అంటుంటే? నన్నెందుకు అంటారు...నేను ఎవడికి తెలుసు..నువ్వే అందరి కీ తెలుసు. కాబట్టే నిన్నే అంటరంటూ మనవరాలితో నవ్వుల తగాదాకు దిగారు.
అమ్మమ్మతో ఇలాంటి పన్నీ వీడియోలు శ్రీలీలకు కొత్తేం కాదు. ఏదో విషయంలో అమ్మమ్మని ఆట పట్టించే ప్రయత్నం చేస్తుంటుంది. అమ్మమ్మ యాస ..శ్రీలీల చలాకీ తనంతో ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మా మారింది. ఈ రకంగానూ శ్రీలీలకు మంచి ప్రచారం దక్కుతోంది. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుందీ వయ్యారి. యువతలో మంచి ఫాలో యింగ్ ఉంది. ఆ క్రేజ్ తోనే సినిమా ఛాన్సులు అందుకుంటుంది.
ప్రస్తుతం టాలీవుడ్ కంటే? బాలీవుడ్ పై దృష్టి పెట్టి పని చేస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగని టాలీవుడ్ కి పూర్తిగా దూరం కాలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న `ఉస్తాద్ భగత్ సింగ్` లో నటిస్తోంది. ప్రస్తుతానికి తెలుగులో కమిట్ అయింది ఈసినిమా ఒక్కటే. ఇటీవలే ఓ రెండు చిత్రాలు వదలుకున్నట్లు వార్తలొచ్చాయి. శ్రీలీల నటించిన తాజా చిత్రం `జూనియర్ `రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
