Begin typing your search above and press return to search.

ఉగాది రోజు శ్రీలీల ఉప‌వాసం!

తెలుగు హీరోయిన్ శ్రీలీల కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది.

By:  Tupaki Desk   |   30 March 2025 1:08 PM IST
Sree Leela’s Ugadi Celebrations
X

తెలుగు హీరోయిన్ శ్రీలీల కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు అందుకుంటుంది. అక్క‌డా అమ్మ‌డికి మంచి గుర్తింపు వ‌స్తుంది? అన్న న‌మ్మ‌కం అభిమానుల్లో ఉంది. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా త‌ర్వాత అంత‌టి ఐడెంటిటీ ద‌క్కించుకుంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

తాజాగా నేడు ఉగాది సంద‌ర్భంగా ఇంట్లో ఉగాదిని ఎలా సెల‌బ్రేట్ చేసుకుంటుందో ? శ్రీలీల చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. `నాకు భ‌క్తి ఎక్కువ‌. ఇంట్లో నిత్యం పూజ‌లు చేస్తుంటారు. పండుగ రోజుల్లో ఇంకా నిష్టగా ఉండి పూజ‌లు చేయ‌డం అల‌వాటు. ఉగాది రోజు ఎక్క‌డికి వెళ్ల‌కుండా ఇంట్లోనే ఉంటా. ఉదయాన్నే లేచి తల స్నానం చేస్తాను. అటుపై ఇల్లంతా ముగ్గుల‌తో అలంక‌రిస్తా.

ఉగాది ప‌చ్చ‌డి కి సంబంధించిన ప‌నుల‌న్నీ నేను ద‌గ్గ‌రుండి చేస్తాను. ప‌చ్చ‌డికి కావాల్సిన ఐట‌మ్స్ అన్ని ముందు రోజే రాత్రే సిద్దం చేసి పెట్టుకుంటా. `లోక‌స‌మ‌స్తా సుఖినో భ‌వంతు` అనే సూక్తిని నమ్ముతా. అందుకే దేవుడిని నా కోసం ఏదీ కోరుకోను. అంద‌రం బాగుండాల‌ని దండం పెట్టుకుంటా. ప‌ని మాత్ర‌మే మ‌న చేతుల్లో ఉంటుంది. ఫ‌లితం కాదు అన్న భ‌గ‌వ‌ద్గీత సూక్తిని గ‌ట్టిగా నమ్ముతాను` అని తెలిపింది.

తెలుగింట అమ్మాయి కావ‌డంతో? ఇలా తెలుగు లోగిళ్ల‌లో జ‌రిగే ఉగాది వేడుక గురించి అమ్మ‌డు ఎంతో చ‌క్క‌గా వివ‌రించింది. సంక్రాంతి సంద‌ర్బంగా ఆ పండుగ‌ను ఎలా సెల‌బ్రేట్ చేసుకుంటుందో కూడా పండ‌గ రోజున రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీలీల డాక్ట‌ర్ చ‌దువుకున్నా...హీరోయిన్ అయినా ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉంటుంది.