శ్రీలీల వర్సెస్ మిహీక.. బెస్ట్ స్మైలీ ఎవరు?
అద్భుత నటన, డ్యాన్సింగ్ ప్రతిభతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది తెలుగమ్మాయి శ్రీలీల. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరస ఆఫర్లతో వేగంగా దూసుకెళుతోంది.
By: Tupaki Desk | 17 Jun 2025 11:16 AM ISTఅద్భుత నటన, డ్యాన్సింగ్ ప్రతిభతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది తెలుగమ్మాయి శ్రీలీల. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరస ఆఫర్లతో వేగంగా దూసుకెళుతోంది. నేటి స్టార్లలో శ్రీలీల దూకుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో ప్రతిభతో దూసుకొచ్చిన స్టార్ గా వెలుగుతోంది. ఇటీవల పుష్ప చిత్రంలో స్పెషల్ నంబర్ `దెబ్బలు పడతయి రో` శ్రీలీల ఇమేజ్ ని పెంచింది.
ఈరోజుతో శ్రీలీల ఒక ఏడాది పెద్దదైంది. జూన్ 14న తన 24వ పుట్టినరోజు జరుపుకుంటోంది. శ్రీలీలను గొప్పగా అభిమానించే తన స్నేహితురాళ్లు సమంత రూత్ ప్రభు, మిహీక బజాజ్ సహా పలువురు బర్త్ డే విషెస్ తెలియజేసారు.
రానా సతీమణి మిహీక దగ్గుబాటి శ్రీలీలకు ఈ విధంగా విషెస్ తెలిపారు. ''నా సన్ షైన్ గాళ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు! కొంచెం ఆలస్యంగా అయినా ఈ సెలబ్రేషన్ జరుపుకోవడంలో చాలా బిజీగా ఉన్నాను.. ఈ సంవత్సరం నేర్చుకోనివి తిరిగి నేర్చుకునే సంవత్సరంగా ఉండనివ్వండి. మీలోని అమాయకత్వం.. ఉత్సాహంతో పాత ప్రపంచ జ్ఞానాన్ని సమతుల్యం చేయగలరు! నిన్ను ప్రేమిస్తున్నాను!'' అని రాసారు. శ్రీలీల- మిహీక ఎంతో సన్నిహితంగా ఉన్న ఓ ఫోటోగ్రాఫ్ ని కూడా మిహీక దగ్గుబాటి షేర్ చేసారు.
సమంత కూడా శ్రీలీల అందమైన ఫోటోని షేర్ చేసి విషెస్ చెప్పారు. ''విషింగ్ యు సన్ షైన్, స్టార్‌డస్ట్.. మీనుంచి అన్ని రకాల మాయాజాలాలను కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు- శ్రీలీల. వేగంగా దూసుకెళుతున్న యువ నటిగా వినోద పరిశ్రమలో ఎక్కువగా చర్చించుకున్న పేర్లలో ఒకరిగా మారావు'' అని రాసారు.
శ్రీలీల ఇప్పటికే దాదాపు డజను చిత్రాలలో నటించింది. తదుపరి కార్తీక్ ఆర్యన్‌తో కలిసి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం తనకు ఒక బహుమతి అవుతుందని శ్రీలీల ఆనందం వ్యక్తం చేసింది. నటిగానే కాదు వైద్యురాలిగాను శ్రీలీల ప్రొఫెషనల్. డాక్టర్ నాకు తెలిసిన మొదటి స్పెల్లింగ్ అని కూడా శ్రీలీల చెబుతుంది. 2019లో ఎపి అర్జున్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కిస్‌తో శ్రీలీల చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
