Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : చీర కట్టులో కిస్సిక్‌ బ్యూటీ అదుర్స్‌

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు శ్రీలీలను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పరిచయం చేశారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 11:00 PM IST
పిక్‌టాక్‌ : చీర కట్టులో కిస్సిక్‌ బ్యూటీ అదుర్స్‌
X

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు శ్రీలీలను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పరిచయం చేశారు. ఆ సినిమా కమర్షియల్‌గా ఆడకున్నా, నటన పరంగా శ్రీలీలకు మంచి పేరును తెచ్చి పెట్టలేక పోయినా కూడా లక్కీగా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో శ్రీలీల డాన్స్‌ను చాలా మంది అభినందించారు. అలా సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగు ప్రేక్షకులు శ్రీలీలను హిట్స్‌... ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా అభిమానించడం మొదలు పెట్టారు. దాంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వచ్చాయి. ధమాకా విజయంతో కమర్షియల్‌గా శ్రీలీల మరింతగా పుంజుకుంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ బిజీ, వాంటెడ్ హీరోయిన్‌ శ్రీలీల అనడంలో సందేహం లేదు.


గత ఏడాది ఈమె పుష్ప 2 సినిమాలో కిస్సిక్‌ ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సాంగ్‌కు వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాట పాన్‌ ఇండియా రేంజ్‌లో శ్రీలీలను టాప్‌లో నిలిపింది. అందుకే కిస్సిక్‌ బ్యూటీ అంటూ ఇప్పటికీ ఈ అమ్మడిని పిలుస్తున్నారు. తన డాన్స్ గ్రేస్‌తో పాటు, అందంతో అలరించిన శ్రీలీల రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దాదాపుగా 12 మిలియన్‌ల ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటారు. తాజా చీర కట్టు ఫోటోలతో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చీర కట్టు ఫోటోలను శ్రీలీల షేర్ చేసింది. చీర కట్టులో సహజంగానే ముద్దుగుమ్మలు చాలా ముద్దుగా ఉంటారు. అందుకే శ్రీలీల ఎప్పుడు చీర కట్టు ఫోటోలు షేర్ చేసినా కచ్చితంగా వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు చీర కట్టు ఫోటోలు షేర్ చేసినా లక్షల మంది లైక్‌ చేసి కామెంట్‌ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఉన్న శ్రీలీల చీరకే అందం తెచ్చింది అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చీర కట్టిన విధానం, అందుకు తగ్గట్లుగా సింప్లీ సూపర్‌ అనిపించే విధంగా మేకోవర్‌, హెయిర్‌ స్టైల్‌ ఇలా ప్రతి ఒక్కటి భలే కుదిరాయి. మెడలో ధరించిన హారంతోనూ శ్రీలీల అందం మరింతగా పెరిగింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


కవ్వించే చూపుతో చీర కట్టు ఫోటోలను షేర్‌ చేసిన శ్రీలీల గంటల వ్యవధిలోనే ఏకంగా రెండు లక్షలకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా అత్యధికులు ఈ చీర కట్టు శ్రీలీల ఫోటోలను షేర్‌ చేశారు. చీర కట్టులో ఈఅమ్మడు అదుర్స్‌ అంటున్నారు. ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈమె నటించిన రాబిన్‌హుడ్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పరచినా కూడా ప్రస్తుతం చేతిలో ఆరు.. ఏడు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో శ్రీలీల నటిస్తున్న మరో మూడు లేదా నాలుగు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌ తో ఈమె చేస్తున్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.