ఎంగేజ్‌మెంట్ వార్తలపై శ్రీలీల క్లారిటీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల రీసెంట్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు రకరకాల చర్చలకు దారి తీశాయి.
By: Tupaki Desk | 1 Jun 2025 6:07 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల రీసెంట్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు రకరకాల చర్చలకు దారి తీశాయి. తాజాగా శ్రీలీలీ ఆ ఫోటోలకు క్లారిటీ ఇస్తూ నెట్టింట జరుగుతున్న డిస్కషన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. నీలి రంగు చీరలో బుగ్గలపై పసుపు, తన చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్లేట్ లో పసుపు, కుంకుమ పట్టుకుని ఉండటంతో శ్రీలీల ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందనుకున్నారంతా.
దానికి తోడు ఆ ఫోటోలను షేర్ చేస్తూ శ్రీలీల బిగ్ డే, కమింగ్ సూన్ అంటూ పోస్ట్ చేయడంతో అమ్మడు ఓ ఇంటిది అయిపోతుందనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ ఓ వీడియోను శ్రీలీల పోస్ట్ చేసింది. ఆ వీడియోలో శ్రీలీల గ్రీన్ కలర్ పట్టు శారీలో పెళ్లి కూతురిలా ముస్తాబై కనిపించింది. పూర్వంలో మన ఇంట్లో పుట్టిన రోజులు ఇలానే జరుపుకునేవాళ్లం అంటూ వీడియోను షేర్ చేసింది.
శ్రీలీల చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే ఇదంతా శ్రీ లీల తల్లి ప్లాన్ చేసింది. జూన్ 14న శ్రీలీల బర్త్ డే జరుపుకోనుండగా, కూతురి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. ఈ ఫోటోల్లో సాఫ్ట్ పింక్ కలర్ దుస్తులు, దానికి తగ్గ జ్యుయలరీ ధరించి బుగ్గన చుక్క కూడా పెట్టడంతో శ్రీలీల లుక్ పెళ్లి కూతురిని తలపించింది. ఈ ఫోటోల్లో శ్రీలీల ఎక్స్‌ప్రెషన్స్, తన ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల మరో పదేళ్ల వరకు పెళ్లి చేసుకోనని ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉందని కూడా వార్తలొస్తున్నాయి.
