తల్లీ కూతుళ్ల చెమ్మ చెక్క చారడేసి మొగ్గ!
యువ నాయిక శ్రీలీల మామ్ స్వర్ణలతతో ఎలాంటి ఆటలు ఆడుతుందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 17 July 2025 6:09 PM ISTయువ నాయిక శ్రీలీల మామ్ స్వర్ణలతతో ఎలాంటి ఆటలు ఆడుతుందో చెప్పాల్సిన పనిలేదు. వాటిని సోష ల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత క్రేజీ బ్యూటీగానూ మారుతోంది. కూతురంటే తల్లికి అంతే ప్రేమ. తల్లి అం టే కుమార్తెకు అంతే ప్రేమ. ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు ఒలకబోసుకున్న వీడియోలు ఇప్పటికే ఎన్నో వైరల్ అయ్యాయి. అలాగని స్వర్ణలతా మేడం డాటర్ రూల్స్ బ్రేక్ చేస్తుదంటే ఊరుకునే టైపు కాదు. తాట తీసే టైపు.
మామ్ టోన్ కి శ్రీలీల కూడా అంతే అలెర్ట్ అవుతుంది. మామ్ గా ఎంత ప్రేమ చూపిస్తుందో తేడా జరిగితే మామ్ లో శివంగి కూడా అలాగే బయటకొస్తుంది. తాజాగా తల్లీ-కూతుళ్లకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఇద్దరు సోఫాలపై కూర్చుని చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఆట ఆడుకుంటున్నారు. శ్రీలీల తల ఊపుతు చప్పట్లు కొడుతూ మధ్య మధ్యలో మామ్ చేతులతో తన చేతుల్ని కలుపుతుంది.
మామ్ కూడా అంతే ఆసక్తిగా ఆటలో భాగమయ్యారు. శ్రీలీలను మించి చలాకీతనంతో మామ్ ఆడుతు న్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది చూసిన నెటి జనులు తల్లీ కూతు ళ్లను చూసి మురిసిపోతున్నారు. శ్రీలీల మూవ్ మెంట్స్ పై కొందరు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆటను మామ్ లీలకు నేర్పిస్తుందంటూ ఓ నెటి జనుడు పోస్ట్ పెట్టాడు. ఇక శ్రీలీల సినిమాల సంగతి చూస్తే..
ప్రస్తుతం అమ్మడు తెలుగు సినిమాల కంటే హిందీ చిత్రాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. వస్తోన్న తెలుగు అవకాశాలను వద్దనుకుని మరీ హిందీ సినిమాలకు సైన్ చేస్తోంది. ఈ క్రమంలో కొంత నెగివిటీ కూడా వ్యక్తమవుతోంది. శ్రీలీలకు సంబంధించిన ప్లానింగ్ అంతా వెనుకుండి చేసేది మామ్ స్వర్ణలతగానే హైలైట్ అవుతున్నారు. బాలీవుడ్ లో ఆ కుటుంబానికి ఉన్న పరిచయాలు కారణంగానే అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
