శ్రీలీల (X) మిహీక: సేమ్ టు సేమ్ ఒకేలా
తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సతీమణి మిహీక దగ్గుబాటితో సన్నిహితంగా ఉన్న ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ అయింది.
By: Tupaki Desk | 17 April 2025 5:04 PM ISTతెలుగమ్మాయి శ్రీలీల టాలీవుడ్, బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో కియరా అద్వాణీ, రష్మిక మందన్న తర్వాత ప్రతిభతో వేగంగా దూసుకెళుతున్న కథానాయికగా శ్రీలీలకు గుర్తింపు దక్కింది. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా హీరోలు, దర్శకనిర్మాతలు శ్రీలీల వెంటపడుతుండడంతో ఈ బ్యూటీకి అవకాశాల పరంగా కొదవేమీ లేదు.
ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ లాంటి క్రేజీ హీరో సరసన `ఆషిఖి` స్టోరి లైన్ తో రూపొందుతున్న క్రేజీ చిత్రంలో నటిస్తూ నేషనల్ మీడియా అటెన్షన్ ని శ్రీలీల తనవైపు తిప్పేసుకుంది. మరోవైపు తెలుగులోను వరుస చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది. ఇక శ్రీలీల ఇండస్ట్రీ స్నేహాలు ఆసక్తికరం.
తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సతీమణి మిహీక దగ్గుబాటితో సన్నిహితంగా ఉన్న ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ అయింది. మిహీక స్వయంగా ఈ ఫోటోగ్రాఫ్ ని ఇన్ స్టాలో షేర్ చేసారు. మిహీక- శ్రీలీల జోడీ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సేమ్ టు సేమ్ కానీ డిఫరెంట్! అంటూ మిహీక బజాజ్ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. దీనికి నెటిజనులు స్పందిస్తూ `జుడ్వా` అంటూ కామెంట్ చేసారు. అక్కా చెల్లెళ్లులా ఉన్నారని కూడా కొందరు వ్యాఖ్యానించారు. జోడీ బావుందని, మంచి స్నేహితులు ఎప్పటికీ ఇలానే ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన కమ్యూనికేషన్ ని మెయింటెయిన్ చేయడంలో శ్రీలీల తర్వాతే. పరిశ్రమకు పరిచయమైన తక్కువ సమయంలోనే ఇంతటి పాపులారిటీ దక్కించుకోవడానికి ఇలాంటి జెన్ - జెడ్ స్పీడ్ కూడా కలిసొచ్చిందనడంలో సందేహం లేదు.
