శ్రీలీల 'ప్రేమ'.. గాలి కూడా వెళ్లలేనంత టైట్ గా!
యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న హీరోయిన్స్ లో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది.
By: Tupaki Desk | 5 April 2025 12:23 PM ISTయంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలానికే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న హీరోయిన్స్ లో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది. తన అందం, అభినయం, డ్యాన్స్ తో ఓ రేంజ్ లో ఫ్యాన్స్ సంపాదించుకున్న ఆమె.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అనే చెప్పాలి.
ఎప్పుడూ సోషల్ మీడియాలో క్రేజీ పిక్స్, ఫన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తూ శ్రీలీల సందడి చేసే వేరే లెవెల్. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే బ్యూటీ.. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. వాళ్ళు అడిగిన పలు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇచ్చిన శ్రీలీల.. ప్రేమపై ఆమె అభిప్రాయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
లవ్ పై మీ ఒపీనియన్ ఏంటని అడగ్గా.. మీరు ప్రేమను కనుగొంటే.. గాలి కూడా వెళ్లనంత గట్టిగా దాన్ని పట్టుకోండి అంటూ తన ఫీలింగ్స్ ను షేర్ చేసుకుంది శ్రీలీల. ఆమె క్రేజీ వర్డ్స్.. ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. అమ్మడు చాలా బాగా చెప్పిందని నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్స.. సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
అయితే శ్రీలీల డేటింగ్ లో ఉన్నట్టు కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ఆమె ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనతో శ్రీలీల తన బాలీవుడ్ డెబ్యూ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఇద్దరూ ఇష్టపడి.. లవ్ లో పడినట్లు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని బీటౌన్ కోడై కూస్తోంది. అదే సమయంలో రీసెంట్ గా కార్తీక్ తల్లి.. ఓ కార్యక్రమంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంచి డాక్టర్ ను కోడలిగా చేసుకోవాలనుందని ఆమె తెలిపారు. దీంతో శ్రీలీల కోసమే ఆమె మాట్లాడారని ఇండస్ట్రీలో వినికిడి.
అదే సమయంలో సెట్స్ లో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ కూడా రీసెంట్ గా వైరల్ అయింది. బిహైండ్ ది సీన్స్ కు చెందిన కొన్ని పిక్స్ ట్రెండ్ అయ్యాయి. దీంతో పెయిర్ అదిరిపోయిందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా శ్రీలీల.. ప్రేమపై క్రేజీగా తన అభిప్రాయం వ్యక్తం చేసింది. మరి అసలు శ్రీలీల ప్రేమలో ఉందో లేదో.. ఆ వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.
