Begin typing your search above and press return to search.

శ్రీ‌లీల కొంటె చూపుల వ‌ల‌పు బాణం

టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ .. ప‌రిశ్ర‌మ ఏదైనా శ్రీ‌లీల కొంటె చూపుల‌కు దాసోహం అనాల్సిందే! అందానికి అందం, ప్ర‌తిభ ఈ అమ్మ‌డి సొంతం.

By:  Tupaki Desk   |   7 Jun 2025 9:26 AM IST
శ్రీ‌లీల కొంటె చూపుల వ‌ల‌పు బాణం
X

టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ .. ప‌రిశ్ర‌మ ఏదైనా శ్రీ‌లీల కొంటె చూపుల‌కు దాసోహం అనాల్సిందే! అందానికి అందం, ప్ర‌తిభ ఈ అమ్మ‌డి సొంతం. ముఖ్యంగా డ్యాన్సింగ్ క్వీన్ గా ఓ వెలుగు వెలుగుతున్న శ్రీలీల‌లో గ్లామ్ యాంగిల్ కూడా ఎప్పుడూ యూత్ లో చ‌ర్చ‌కొస్తుంది.

ఇక ఫ్యాష‌న్ సెన్స్ లోను ఈ తెలుగ‌మ్మాయి త‌గ్గేదే లే! అంటోంది. ముంబై, దిల్లీ, కోల్ క‌తా, బెంగ‌ళూరు లాంటి మెట్రో న‌గ‌రాల నుంచి వ‌చ్చిన చాలా మంది టాప్ మోడల్స్ కి పోటీనిచ్చేంత మ్యాట‌ర్ ఉంది ఈ బ్యూటీలో. గ‌త కొంత కాలంగా శ్రీ‌లీల ఇన్ స్టాలో స్పెష‌ల్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది.

తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ లో శ్రీ‌లీల సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. సింపుల్ గా న‌వ్వేస్తూ, హాఫ్ షోల్డ‌ర్ ఫ్రాక్‌లో ప్లెజెంట్ గా క‌నిపిస్తున్న ఈ బ్యూటీ గ‌జిబిజి షూట్ లైఫ్ నుంచి రిలాక్స్ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఈ అందాల భామ ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను సినిమాల‌తో బిజీ బిజీగా ఉంది. జూనియ‌ర్స్, మాస్ జాత‌ర‌, లెనిన్ అనే చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌నా ఓ చిత్రంలో శ్రీ‌లీల క‌థానాయిక‌. ఇది ఆషిఖి ఫ్రాంఛైజీ నుంచి వ‌స్తున్న సినిమాగా ప్ర‌చారం ఉన్నా, అలాంటిదేమీ లేద‌ని చిత్ర‌బృందం తెలిపింది. ప‌రాశ‌క్తి అనే త‌మిళ చిత్రంలోను ఈ భామ న‌టించింది.