Begin typing your search above and press return to search.

యంగ్ హీరోతో శ్రీలీల రొమాన్స్ అంతా ప్రీప్లాన్డ్ గానా?

తెలుగు హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. హిట్ ప్రాంచైజీ `ఆషీకీ` నుంచి రిలీజ్ అవుతున్న మూడ‌వ చిత్ర‌మిది.

By:  Tupaki Desk   |   14 May 2025 5:25 AM
Sreeleela’s Bollywood Debut with Aashiqui 3
X

తెలుగు హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. హిట్ ప్రాంచైజీ `ఆషీకీ` నుంచి రిలీజ్ అవుతున్న మూడ‌వ చిత్ర‌మిది. ఇందులో అమ్మ‌డు కార్తీక్ ఆర్య‌న్ కి జోడీగా న‌టిస్తుంది. అనురాగ్ బ‌సు ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే ఓ బిగ్ షెడ్యూల్ కూడా పూర్త‌యింది. ఇందులో కార్తీక్ ఆర్య‌న్- శ్రీలీ మ‌ద్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పీక్స్ లో ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది.

ఇద్దరి మ‌ధ్య పెద‌వి ముద్దులు..ఇంటిమేట్ స‌న్నిశాలతో ర‌క్తి క‌ట్టించ‌డం ఖాయ‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు కూడా వార్త‌లొచ్చాయి. అటు పైకార్తీక్ ఆర్య‌న్ ఇంటికి శ్రీలీల త‌ల్లితో పాటు అటెండ్ అవ్వ‌డంతో? ఈ ప్రేమ వ్య‌వ‌హ‌ర‌మంతా నిజ‌మా? అని బాలీవుడ్ కోడై కూసింది. అయితే ఈ ప్ర‌చారాన్ని శ్రీలీల వెంట‌నే ఖండించింది.

ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి ల‌వ్ లేద‌ని...కార్తీక్ ఆర్య‌న్ కుటుంబంతో త‌న‌కు ఎంతో కాలంగా తెలుస‌న‌ని...రెండు కుటుంబాల మ‌ధ్య మంచి అనుబంధం ఉంద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. దీంతో కార్తీక్ కేవ‌లం స్నేహితుడు మా త్రమేన‌ని క్లారిటీ వ‌చ్చింది. తాజాగా కార్తీక్ ఆర్య‌న్ కూడా శ్రీలీల వృత్తి నైపుణ్యాల గురించి ఆకాశానికి ఎత్తే సాడు. తాను ఎంతో ప్ర‌తిభావంతురాలు అన్నాడు. సెట్ లో ఎంతో క‌మిట్ మెంట్ తో..డెడికేష‌న్ తో ప‌ని చేస్తుంద‌న్నాడు.

ఎంతో స‌హ‌నంతో ఉంటుంద‌న్నాడు. దీంతో అనురాగ్ బ‌స్ కావాల‌నే శ్రీలీల‌ను ఈసినిమాకు ఎంపిక చేసిన‌ట్లు వినిపిస్తుంది. ఇద్ద‌రు మంచి స్నేహితులైతే ఒక‌ర్ని ఒక‌రు అర్దం చేసుకోగ‌ల‌రు. ఈ రిలేష‌న్ షిప్ రొమాంటిక్ స‌న్నివేశాల మేకింగ్ ప‌రంగా దర్శ‌కుడికి సుల‌భం అవుతుంది. కొత్త న‌టీన‌టుల‌తో ఇలాంటి స‌న్నివేశాలు అంత సుల‌భం కాదు. ఎంతో అండ‌ర్ స్టాండింగ్ ఉంటే త‌ప్ప ఇంటిమేట్ స‌న్నివేశాలు సాధ్యం కాదు. ఆ ప్లాన్ లో భాగంగానే కార్తీక్ ఆర్య‌న్ స్నేహితురాలైన శ్రీలీల‌ను ప్ర‌త్యేకించి తీసుకున్నార‌ని వార్త‌లొస్తున్నాయి.