Begin typing your search above and press return to search.

ఆయ‌న‌తో 2 నిమిషాలు మాట్లాడితే చాలు

గాలి జ‌నార్థ‌న్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా జూనియ‌ర్. ఈ సినిమాలో జెనీలియా కీల‌క పాత్ర‌లో న‌టించారు.

By:  Tupaki Desk   |   17 July 2025 11:39 AM IST
ఆయ‌న‌తో 2 నిమిషాలు మాట్లాడితే చాలు
X

గాలి జ‌నార్థ‌న్ రెడ్డి కొడుకు కిరిటీ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా జూనియ‌ర్. ఈ సినిమాలో జెనీలియా కీల‌క పాత్ర‌లో న‌టించారు. జులై 18న జూనియ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ బుధ‌వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయ‌గా ఆ ఈవెంట్ లో శ్రీలీల మాట్లాడిన మాట‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

ఓ చిన్న క‌థ‌ను పెద్ద కాన్వాస్ లో చెప్పే ప్ర‌య‌త్నం జూనియ‌ర్ తో చేస్తున్నామ‌ని చెప్పారు శ్రీలీల‌. హ‌హా హాసినిగా హాయిగా మా గుండెల్లో సెటిలైన జెనీలియా ఇప్పుడు మ‌ళ్లీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తున్నారు. కంబ్యాక్ కోసం జూనియ‌ర్ ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూ, జెనీలియా రాక‌తో ఈ సినిమాకు ఓ బ్రాండ్ వాల్యూ వ‌చ్చింద‌ని, జెనీలియా త‌న‌నెంతో బాగా చూసుకుంద‌ని, మొద‌టి నుంచి జెనీలియా త‌న‌కు ప్ర‌తీ విష‌యంలో తోడుగా ఉంటూ ప్రేమ‌గా ఉంద‌ని, మేక‌ప్ విష‌యంలో కూడా జెనీలియా త‌న‌కు హెల్ప్ చేసింద‌ని శ్రీలీల వెల్ల‌డించారు.

నిజంగా ఇవాళ త‌న‌కు వైర‌ల్ వ‌య్యారి ట్యాగ్ వ‌చ్చిందంటే దానికి కార‌ణం దేవీ శ్రీ ప్ర‌సాదేన‌ని, ఎవ‌రైనా స‌రే పాట కంపోజ్ చేస్తే త‌మ ప‌ని అయిపోతుంద‌నుకుంటారు కానీ దేవీ శ్రీ ప్ర‌సాద్ పాట ఇవ్వడ‌మే కాకుండా ఇలాంటి స్టెప్పులేయండి, ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుంద‌ని స‌ల‌హాలిస్తూ సెట్స్ కి వ‌చ్చి అంద‌రికీ ఎన‌ర్జీ ఇస్తార‌ని అందుకే అత‌ను రాక్ స్టార్ అయ్యార‌ని, వైర‌ల్ దేవీ శ్రీ అయితే, తాను వ‌య్యారిన‌ని అన్నారు.

ఇక డీఓపీ సెంథిల్ కుమార్ గురించి మాట్లాడుతూ శ్రీలీల ఒకింత ఎమోష‌న‌ల్ అయ్యారు. లైఫ్ లో ఎవ‌రికైనా ఏ బాధ ఉన్నా ఆయ‌న‌తో రెండు నిమిషాలు మాట్లాడితే చాలు, మొత్తం నార్మ‌లైపోతుంద‌ని, ఆయ‌న చుట్టూ ఒక డివైన్ ఆరా ఉంద‌ని, షూటింగ్ లాస్ట్ రోజు మిమ్మ‌ల్ని వ‌దిలి వెళ్లిపోతున్నందుకు చాలా బాధ‌గా అనిపించింద‌ని, ఆయ‌న్ని చాలా మిస్ అవుతున్న‌ట్టు చెప్పిన శ్రీలీల‌, ఎన్ని క‌ష్టాలున్నా సెంథిల్ స‌ర్ ఈ సినిమా కోసం ఎంత స్ట్రాంగ్ గా వ‌ర్క్ చేశారో త‌న‌కు తెలుస‌ని, ఆ దేవుడెప్పుడూ ఆయ‌న‌తో ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.