'జూనియర్' శ్రీలీలకి సీనియర్ పారితోషికం..!
ఈ సినిమాలో కిరీటి రెడ్డికి జోడీగా హీరోయిన్‌గా నటించిన శ్రీలీల భారీ పారితోషికం అందుకుందనే వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 14 July 2025 1:00 PM ISTకిరీటి రెడ్డి హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ద్వి భాష చిత్రం 'జూనియర్' ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా హీరో కిరీటి రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కావడంతో కన్నడ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకుల్లోనూ 'జూనియర్' సినిమాపై ఆసక్తి నెలకొంది. వందల కోట్ల ఆస్తులు ఉన్న గాలి జనార్థన్ రెడ్డి తన కొడుకును హీరోగా సొంతంగానే సినిమాను చేయవచ్చు. కానీ ఈ సినిమా నిర్మాణ బాధ్యత ను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కి ఇచ్చారు. తెలుగులో ఈయన పలు సినిమాలను నిర్మించిన విషయం తెల్సిందే. ఈ మధ్య టాలీవుడ్‌కి దూరంగా ఉంటున్న సాయి కొర్రపాటి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఈ సినిమాలో కిరీటి రెడ్డికి జోడీగా హీరోయిన్‌గా నటించిన శ్రీలీల భారీ పారితోషికం అందుకుందనే వార్తలు వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఈ సినిమాలో శ్రీలీల నటించినందుకు గాను దాదాపుగా రూ.4 కోట్ల పారితోషికం అందుకుందని తన కథనంలో పేర్కొంది. హీరో కొత్త వాడు కావడంతో శ్రీలీల ఈ స్థాయి పారితోషికంను తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగానే శ్రీలీల స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు గాను రూ.2 కోట్లకు మించిన పారితోషికం తీసుకుంటుంది. తన స్టార్‌డం పక్కన పెట్టి కొత్త కుర్రాడితో నటిచినందుకు గాను ఆ స్థాయి పారితోషికం తీసుకోవడం తప్పేం లేదు అంటూ కన్నడ సినీ వర్గాల్లోనూ టాక్ వినిపిస్తోంది.
'జూనియర్' సినిమా కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ హాజరు అయ్యాడు. ఆయన ఈ సినిమాలోని వైరల్ వయ్యారి పాటకు డాన్స్ వేయడం ద్వారా అభిమానులను ఉర్రూతలూగించాడు. కన్నడంలో జూనియర్‌కి పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మంచి మొత్తం నమోదు అయిందని సమాచారం అందుతోంది. ఇక తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ హాజరు అవుతాడనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ హాజరుతో ఖచ్చితంగా తెలుగు మార్కెట్‌లోనూ జూనియర్‌కి ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీలీల, కిరీటిల వైరల్ వయ్యారి పాట వల్ల తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌ను చేయడం ద్వారా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకున్న శ్రీలీల 'జూనియర్' సినిమాలో నటించడం ద్వారా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో బొమ్మరిలు బ్యూటీ జెనీలియా సైతం కీలక పాత్రలో నటించింది. చాలా కాలం తర్వాత జెనీలియా ఈ సినిమాతో సౌత్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు జూనియర్ కోసం వెయిట్ చేస్తున్నారు. జెనీలియా సైతం ఈ సినిమాలో నటించినందుకు గాను భారీ పారితోషికం అందుకుందని టాక్ వినిపిస్తుంది. శ్రీలీల మాత్రం జూనియర్ సినిమాకు తన సీనియర్ హీరోయిన్‌ల కంటే ఎక్కువ పారితోషికం అందుకోవడం విశేషం. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీల అదే పారితోషికంను స్టార్ హీరోల సినిమాలకు తీసుకున్నా ఆశ్చర్యం లేదు.
