Begin typing your search above and press return to search.

'పుష్ప 2' తర్వాత 'పెద్ది'... ఇది చాలా స్పెషల్‌ గురూ!

ఆ పాటను శ్రీలీలతో చేయిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నిర్మాతలు చర్చించారని సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   5 May 2025 8:08 AM
పుష్ప 2 తర్వాత పెద్ది... ఇది చాలా స్పెషల్‌ గురూ!
X

టాలీవుడ్‌లో శ్రీలీల ప్రస్తుతం మోస్ట్‌ యాక్టివ్‌ హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మొదటి సినిమా పెళ్లి సందడి పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా లక్‌ కలిసి వచ్చి శ్రీలీలకు ధమాకా సినిమాతో బిగ్‌ హిట్‌ దక్కింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఏకంగా అర డజను సినిమాలు చేసే అవకాశం ను దక్కించుకున్న విషయం తెల్సిందే. గత ఏడాది మహేష్ బాబు మూవీ గుంటూరు కారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పరిచిన ఏడాది చివర్లో పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో కిస్సిక్ అంటూ శ్రీలీల చేసిన ఐటెం సాంగ్‌ మరో స్థాయికి సినిమాను తీసుకు వెళ్లింది. అందుకే శ్రీలీల క్రేజ్ కూడా పాన్‌ ఇండియా రేంజ్‌లో పెరిగింది. కిస్సిక్‌ కారణంగానే బాలీవుడ్‌లో సినిమాను చేసే అవకాశంను దక్కించుకుంది. తమిళనాట కూడా ఈమె ఒక సినిమాను చేస్తుంది. హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేస్తున్న శ్రీలీల త్వరలోనే తెలుగులో ఒక బిగ్‌ సినిమాలో ఐటెం సాంగ్‌ చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ బిగ్‌ మూవీ మరేదో కాదు మెగా పవర్‌ స్టార్‌ నటిస్తున్న పెద్ది సినిమా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు గుప్పుమంటున్నాయి.

రామ్‌ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే ధీమాతో ప్రేక్షకులు ఉన్నారు. బుచ్చి బాబు ఈ సినిమా కోసం ఒక ప్రత్యేక పాటను ప్లాన్‌ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ పాటను శ్రీలీలతో చేయిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నిర్మాతలు చర్చించారని సమాచారం అందుతోంది. పుష్ప 2 సినిమాతో శ్రీలీల ఐటెం సాంగ్‌తో ఆకట్టుకుంది. కనుక రిస్క్‌ తీసుకోకుండా, కొత్త అమ్మాయితో కాకుండా శ్రీలీలను ఐటెం సాంగ్‌ కు ఎంపిక చేయడం అనేది మంచి నిర్ణయం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

శ్రీలీల కూడా ఐటెం సాంగ్స్ చేసేందుకు ఓకే అంటుంది. పైగా రామ్‌ చరణ్ వంటి బిగ్‌ స్టార్‌కి జోడీగా ఐటెం సాంగ్‌లో నటించడం, పైగా ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన పాటలో కనిపించాలి అనుకోవడం ఎవరికి అయినా డ్రీమ్‌. కనుక శ్రీలీల కచ్చితంగా అవకాశం వస్తే పెద్ది సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సుకుమార్‌ సినిమాను ఫాలో అవుతూ బుచ్చిబాబు పెద్ది సినిమాను తీస్తున్నాడు. కనుక ఐటెం సాంగ్‌ ఖచ్చితంగా ఉండబోతుంది. ఆ ఐటెం సాంగ్‌లో శ్రీలీల ఉంటుందా అనేది చూడాలి.