బాలీవుడ్ సంచలన క్రైమ్ థ్రిల్లర్ లో కిసిక్ బ్యూటీ!
తెలుగమ్మాయి శ్రీలీల బాలీవుడ్ ప్రయాణం మొదలైన సంగతి తెలిసిందే. `ఆషీకీ 3`తో అమ్మడు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతుంది.
By: Tupaki Desk | 22 April 2025 6:22 AMతెలుగమ్మాయి శ్రీలీల బాలీవుడ్ ప్రయాణం మొదలైన సంగతి తెలిసిందే. `ఆషీకీ 3`తో అమ్మడు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతుంది. కిసిక్ బ్యూటీగా పాన్ ఇండియాలో సంచలనమైన తర్వాత వచ్చిన అవకాశం ఇది. దీంతో ఈ బ్యూటీఫుల్ లవ్ స్టోరీలో అమ్మడు ఎలా అలరిస్తుంది? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం సెట్స్ లో ఉండగానే అమ్మడు మరో బాలీవుడ్ ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇది సంచలన వెబ్ సిరీస్ కావడం విశేషం. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన `ఫర్జీ` ఎంత వెబ్ సిరీస్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో దొంగనోట్లు ముద్రించే వ్యక్తి పాత్రలో షాహిద్ నటన..ఆహార్యం ఎంతగానో అలరించింది. దీంతో ఇటీవలే ఈ సిరీస్ కు సీక్వెల్ గా `పర్జీ 2`ని కూడా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా షాహిద్ కి జోడీగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ లో కొంత మంది యంగ్ భామలను ఇప్పటికే స్క్రీనింగ్ చేసినప్పటికీ వాళ్లకన్నా శ్రీలీల పర్పెక్ట్ గా ఆ రోల్ కి సూటువుతుందట. దీంతో ఆ పాత్రకు శ్రీలీల దాదాపు ఎంపిక ఖరారైనట్లేనని అంటున్నారు. మరి ఈ విషయాన్ని మేకర్స్ ధృవీకరించాలి.
ఇప్పటి వరకూ రాజ్ అండ్ డీకే సౌత్ నుంచి సమంతకు పెద్ద పీట వేసారు. `ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ లో అవకాశం ఇచ్చారు. అటుపై `సీటాడెల్` లోనూ సమంతనే తీసుకున్నారు. కానీ `ప్యామిలీ మ్యాన్ 3` లో ఛాన్స్ ఇవ్వలేదు. ప్రకటించిన `సీటాడెల్ 2`ని రద్దు చేసారు. కొత్తగా ఇప్పుడు రాజ్ అండ్ డీకే తమ వరల్డ్ లోకి శ్రీలీలను ఆహ్వానించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. శ్రీలీల అక్కడా ప్రూవ్ చేసుకోగల్గితే రాజ్ అండ్ డీకే తో చాలా కాలం పాటు పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంతవరకూ శ్రీలీల వెబ్ సిరీస్ ల్లోకి ఎంటర్ అవ్వని సంగతి తెలిసిందే.