హిమాలయాల్లో ప్రకృతి అందాల నడుమ డాక్టర్ శ్రీలీల
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల తాజాగా హిమాలయాల పర్యటనకు వెళ్ళిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. అవి నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి.
By: Sivaji Kontham | 31 May 2026 11:07 AM ISTటాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల తాజాగా హిమాలయాల పర్యటనకు వెళ్ళిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. అవి నెట్టింట జోరుగా వైరల్ అవుతున్నాయి. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా ఈ బ్యూటీ మంచు పర్వతాలలో ఎంతో జాలీగా దిగిన అద్భుతమైన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇండస్ట్రీలో వరుస షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడిపే ఈ కన్నడ బ్యూటీ కాస్త బ్రేక్ దొరకడంతో ఇలా హిమాలయాల మంచు కొండల నడుమ ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ సేదతీరుతోంది.
ప్రస్తుతం శ్రీలీల కెరీర్ పరంగా ఎంతో కీలకమైన దశలో ఉంది. ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోల సరసన పలు క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూనే.. అటు హిందీ ఇండస్ట్రీలోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఒక భారీ హిందీ చిత్రంలో నటిస్తుండగా... ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద బిగ్ బ్లాక్ బస్టర్ వైబ్స్ తెస్తుందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లోనూ ఎదిగేందుకు ఈ గ్లామర్ డాళ్ సిద్ధమవుతోంది.
జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న శ్రీలీల, అటు ప్రొఫెషనల్ లైఫ్‌ను ఇటు పర్సనల్ లైఫ్‌ను ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేస్తోంది. ఇటీవలే తన ఎంబీబీఎస్ స్టడీస్ ని కూడా పూర్తి చేసి డాక్టర్ గా ప్రాక్టీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఓవైపు నటిగా అగ్రతాంబూలం అందుకుంటోంది. మరోవైపు ఉన్నత చదువులు చదివి స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగుతోంది.
ఇంతలోనే వ్యక్తిగత జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాధించేలా కుటుంబంతో కలిసి ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం హిమాలయాల టూర్ ని ముగించినా.. వెకేషన్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. మంచు కురుస్తున్న వాతావరణంలో ఐస్ ముక్కలతో ఆడుకుంటూ చిద్విలాసంగా ఉన్న ఫోటోలను శ్రీలీల షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి. ఈ వెకేషన్ ఫోటోలు చూస్తుంటే.. షూటింగ్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి శ్రీలీల ప్లాన్ చేసిన బ్యూటిఫుల్ ట్రిప్ జ్ఞాపకాలు నెటిజన్లను అలరిస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్న ప్రేమకథా చిత్రానికి తు మేరీ జిందగీ హై` అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఇది ఆషిఖి తరహా కథాంశంతో రూపొందుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇది రకరకాల కారణాలతో కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం డిలేకు కారణమైంది. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
