Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఛ‌మ్కీల చీర‌లో జిగేలు రాణి

అలా కొంటెగా వాలుగా చూస్తూ గుండె ల‌య త‌ప్పేలా చేసిన శ్రీ‌లీల ప్ర‌స్తుతం కార్తీక్ ఆర్య‌న్ ని కూడా త‌న‌దైన అందం,

By:  Tupaki Desk   |   7 July 2025 10:21 PM IST
ఫోటో స్టోరి: ఛ‌మ్కీల చీర‌లో జిగేలు రాణి
X

వాలు చూపుల‌తో కుర్ర‌కారు గుండెల్ని కోసేస్తున్న ఈ అమ్మ‌డు ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా? చూడ‌గానే కొంద‌రు ఈమె జిగేలు రాణి అని ... ఛ‌మ్కీల సుంద‌రి అని పొగిడేస్తున్నారు. ఛ‌మ్కీల చీర‌లో జిగేలు రాణి! అంటూ ఒక అభిమాని కొంటెగా పొగిడేసాడు. హ‌త్తుకుపోయే వ‌య్యారం.. అద‌ర‌గొట్టే సింగారం అంటే మీనింగ్ ఈ బ్యూటీనే!

అలా కొంటెగా వాలుగా చూస్తూ గుండె ల‌య త‌ప్పేలా చేసిన శ్రీ‌లీల ప్ర‌స్తుతం కార్తీక్ ఆర్య‌న్ ని కూడా త‌న‌దైన అందం, చురుకుద‌నంతో ఆక‌ర్షించింద‌ని, ఈ యువ‌జంట నిండా ప్రేమ‌లో మునిగింద‌ని ప్ర‌చారం సాగుతోంది. బాలీవుడ్ రైజింగ్ స్టార్ తో శ్రీ‌లీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ ద స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతం అంటూ ఫ్యాన్స్ కితాబిచ్చేస్తున్నారు.

ఈ స‌మ‌యంలో శ్రీ‌లీల పేరు అన్ని ప‌రిశ్ర‌మల్లో మార్మోగుతోంది. ఇటు కెరీర్ వేట.. అటు డేటింగ్ లైఫ్‌ రెండిటిలోను అలుప‌న్న‌దే లేకుండా ముందుకు దూసుకుపోతున్న శ్రీ‌లీల హిందీ చిత్ర‌సీమ‌ను కూడా ఏల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ర‌ష్మిక త‌ర్వాత మ‌ళ్లీ ఆ అవ‌కాశం ఉన్న‌ది శ్రీ‌లీల‌కు మాత్ర‌మేన‌ని విశ్లేషిస్తున్నారు. కార్తీక్ ఆర్య‌న్ తో రొమాంటిక్ ల‌వ్ స్టోరి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర్క‌వుటైతే, ఆ త‌ర్వాత కూడా ఈ జోడీ రిపీట‌య్యే ఛాన్సుంటుంది. ప‌రిశ్ర‌మలోని టాప్ హీరోలంతా శ్రీ‌లీల వెంట ప‌డ‌డం ఖాయం. జ‌స్ట్ వెయిట్.. మునుముందు ఏం జ‌ర‌గ‌బోతోందో!