Begin typing your search above and press return to search.

ఈ స్టైల్ లో నిన్ను కొట్టేదెవరు శ్రీలీల

ఈ కొత్త ఫోటోషూట్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ స్టైల్ లో నిన్ను కొట్టేదెవరు శ్రీలీల అంటూ మరికొందరు స్ట్రాంగ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Sept 2025 10:55 PM IST
ఈ స్టైల్ లో నిన్ను కొట్టేదెవరు శ్రీలీల
X

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువ నటి శ్రీలీల, మరోసారి తన స్టైలిష్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోల్లో బ్లాక్ డ్రెస్‌తో అందంగా మెరిసిపోతోంది. లైటింగ్, ఎక్స్‌ప్రెషన్స్‌తో కలిపి ఈ ఫోటోలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. నేటి ట్రెండీ ఫొటోషూట్లలో ఉండాల్సిన గ్లామర్, గ్రేస్ రెండూ కలిపినట్లుగా ఉన్నాయి.

శ్రీలీల కెరీర్ ప్రారంభం కన్నడలో అయినా, తెలుగు సినిమాల్లో మాత్రం ఆమె స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. "పెల్లిసందD"తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, "ధమాకా"లో రవితేజ సరసన నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా టాప్ హీరోల సినిమాల్లో భాగమవుతూ స్టార్ హీరోయిన్ లైన్‌లో నిలిచింది.

ఆమధ్య మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారంలో కూడా శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఆకట్టుకుంది. ఆమెకు డ్యాన్స్‌లో ఉన్న ఎనర్జీ, ఎక్స్‌ప్రెసివ్ యాక్టింగ్ అన్నీ మాస్‌కి, క్లాస్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఎక్కువమంది దర్శకులు, నిర్మాతలు తమ ప్రాజెక్ట్స్‌లో శ్రీలీలను సైన్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ కొత్త ఫోటోషూట్‌కి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ స్టైల్ లో నిన్ను కొట్టేదెవరు శ్రీలీల అంటూ మరికొందరు స్ట్రాంగ్ ఎలివేషన్స్ ఇస్తున్నారు. కొన్ని గంటల్లోనే లక్షల్లో లైక్స్ రావడం చూస్తే ఆమె పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అంతేకాదు, టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ స్టార్ హీరోయిన్‌గా ఆమెను పలువురు ఫ్యాన్స్ ఇప్పటికే ట్యాగ్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా బిగ్ బడ్జెట్ సినిమాలే కావడంతో, శ్రీలీల కెరీర్ మరింత హైప్ అందుకోవడం ఖాయం.