Begin typing your search above and press return to search.

లెనిన్ నుంచి శ్రీలీల వెనకడుగు.. అసలు కారణం ఇదే!

ఇప్పటివరకు టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   26 Jun 2025 4:23 PM IST
లెనిన్ నుంచి శ్రీలీల వెనకడుగు.. అసలు కారణం ఇదే!
X

ఇప్పటివరకు టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. గ్లామర్‌తో పాటు డాన్స్‌లోనూ తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ, యూత్‌లో ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల పలు పెద్ద ప్రాజెక్టుల్లో భాగమవుతుండడంతో ఆమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఈలోగా అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న "లెనిన్" సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. మురళి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక మాస్ డిఫరెంట్ లవ్ స్టోరీగా రానుంది. అయితే హీరోయిన్ శ్రీలీల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. అఖిల్ శ్రీలీల కాంబినేషన్‌ అనగానే ఓ ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆమె వెనక్కి తగ్గిన నేపథ్యంలో అసలు కారణం ఏమిటన్నది అందరికీ ప్రశ్నగా మారింది.

నిజానికి ఈ సినిమాను వదలాల్సి వచ్చిన కారణం షెడ్యూల్ క్లాష్ అని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలీల పవన్ కల్యాణ్‌తో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో "లెనిన్" సినిమాకూ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ కావడంతో, రెండు సినిమాలకు ఒకేసారి డేట్స్ ఇవ్వడం ఆమెకు సాధ్యపడలేదు.

ఈ నేపథ్యంలో ఆమె చాలా బాధతో "లెనిన్" నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిసింది. శ్రీలీల ఈ నిర్ణయంతో కొంచెం నిరుత్సాహపడిందన్నా, లెనిన్ టీమ్ మాత్రం ఆమె నిర్ణయానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించారట. మొదటి నుంచి ఆమె ప్రొఫెషనలిజాన్ని మెచ్చుకున్న టీమ్, ఈ నిర్ణయాన్ని స్వీకరించి, కొత్త హీరోయిన్ ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుత టాక్ ప్రకారం మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీని సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే "లెనిన్" మూవీకి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక "ఉస్తాద్ భగత్ సింగ్" విషయంలో శ్రీలీల పాత్రకు భారీ స్కోప్ ఉందని టాక్ వినిపిస్తోంది. పవన్ సరసన ఆమె నటన, మాస్ లుక్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.