Begin typing your search above and press return to search.

సైలెంట్ గా శ్రీలీల ఎంగేజ్‌మెంట్?

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల రీసెంట్ గా త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన స్టోరీలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవ‌డంతో పాటూ అమ్మ‌డిని వార్త‌ల్లోకెక్కించాయి

By:  Tupaki Desk   |   31 May 2025 1:12 PM IST
సైలెంట్ గా శ్రీలీల ఎంగేజ్‌మెంట్?
X

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల రీసెంట్ గా త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన స్టోరీలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవ‌డంతో పాటూ అమ్మ‌డిని వార్త‌ల్లోకెక్కించాయి. ఈ ఫోటోల్లో శ్రీలీల చెంప‌ల‌కు ప‌సుపు పూరి పెద్ద‌లు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఆ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఈ రోజు నాకు బిగ్ డే అంటూ మిగిలిన వివ‌రాలు క‌మింగ్ సూన్ అంటూ హింట్ ఇచ్చింది.

దీంతో ఈ ఫోటోలు, శ్రీలీల ఇచ్చిన హింట్ ను చూసి అంద‌రూ అమ్మ‌డికి సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్ అయిపోయింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. కానీ శ్రీలీలకు ప‌సుపు పూసి పెద్ద‌ల ఆశీర్వాదాలు ఇవ్వ‌డం వెనుక వేరే కార‌ణముంద‌ని తెలుస్తోంది. జూన్ 14న శ్రీలీల బ‌ర్త్ డే. కానీ తిథుల ప్ర‌కారం ఆ పుట్టినరోజు వేడుక‌ను శ్రీలీల ఇలా కాస్త ముందుగానే జ‌రుపుకుంద‌ట‌. ఎలాంటి సంద‌ర్భాన్నైనా సాంప్ర‌దాయ బ‌ద్ధంగా జ‌రుపుకునే శ్రీలీల పుట్టిన రోజును కూడా ఇలా తిథుల ప్ర‌కారం జ‌రుపుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

అయితే ఈ ఫోటోల‌ను చూసిన నెటిజ‌న్లు కొంద‌రు శ్రీలీల‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింద‌ని అంటుంటే, మ‌రికొంద‌రు ఆమె తిథుల ప్ర‌కారం బ‌ర్త్ డే ను జరుపుకుంద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు ఏదో క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూట్ కోసం శ్రీలీల ఇలా ప్ర‌మోష‌న్స్ చేస్తుంద‌ని అంటున్నారు. ఇంకొంత‌మందైతే అస‌లు విష‌యం చెప్ప‌కుండా ఇలా నాన్చడ‌మేంట‌ని అమ్మ‌డిపై మండి ప‌డుతున్నారు.

అయితే ఈ విష‌యమై శ్రీలీల త్వ‌ర‌లోనే క్లారిటీ ఇచ్చే ఛాన్సుంది. ఇదిలా ఉండ‌గా బాలీవుడ్ న‌టుడు కార్తీక్ ఆర్యన్ తో శ్రీలీల రిలేష‌న్ లో ఉందంటూ కొన్నాళ్లుగా వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని టాక్. దానికి త‌గ్గ‌ట్టే కార్తీక్ ఫ్యామిలీలో ఏ చిన్న ఈవెంట్ జ‌రిగినా అందులో శ్రీలీల కూడా క‌నిపిస్తూ ఉన్న విష‌యం తెలిసిందే.