Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : కవర్ పేజ్‌పై శ్రీలీల కవ్వింపులు

గత ఏడాది ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పరచినా శ్రీలీలకు క్రేజ్‌ పెరిగింది.

By:  Tupaki Desk   |   21 May 2025 10:58 PM IST
పిక్‌టాక్‌ : కవర్ పేజ్‌పై శ్రీలీల కవ్వింపులు
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'పెళ్లి సందడి' సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు మూలాలు ఉన్న తెలుగు అమ్మాయి కావడంతో శ్రీలీలకు టాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు రాకపోవచ్చు అని అంతా అనుకున్నారు. కానీ శ్రీలీల తెలుగు అమ్మాయి అయినప్పటికీ పుట్టి పెరిగింది ఎక్కువ శాతం బయట రాష్ట్రాల్లో కనుక లక్కీగా ఆమెకు తెలుగు అమ్మాయి అనే ముద్ర పడలేదు. దాంతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కుతున్నాయి. గత ఏడాది ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా నిరాశ పరచినా శ్రీలీలకు క్రేజ్‌ పెరిగింది.

ధమాకా విజయంతో శ్రీలీల చాలా సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో ఏకంగా అర డజను సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికి ఇప్పుడు కూడా శ్రీలీల చేతిలో ఏకంగా మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటీవల కోలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్‌ను సొంతం చేసుకుంది. సినిమాలతో చాలా బిజీగా ఉండే శ్రీలీల మోడలింగ్‌ పై ఆసక్తితో ఫోటో షూట్స్‌తో సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇస్తూ ఉంటుంది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్‌ ఎల్లి కవర్‌ పేజ్‌ పై ఎక్కింది. ఎల్లి మే 2025 ఎడిషన్ కవర్‌ పేజీ పై శ్రీలీల చాలా అందంగా కనిపిస్తుంది. కవర్‌ కి అందం తెచ్చిందని, ఎంతో మంది హీరోయిన్స్‌ కవర్‌ ఫోజ్‌లు ఇచ్చినా శ్రీలీల ఫోటోలు చాలా స్పెషల్‌ అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

ఎల్లో డ్రెస్‌లో కవ్వించే విధంగా చూస్తూ సింపుల్‌ అండ్‌ స్వీట్ మేకోవర్‌తో భలే ఉంది అంటూ శ్రీలీల కవర్ స్టిల్‌ను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. అందమైన శ్రీలీల ఈ కవర్ ఫోటోలో మరింత అందంగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. డాక్టర్ చదివిన శ్రీలీల తల్లి బెంగళూరులో గైనకాలజిస్ట్‌ అనే విషయం తెల్సిందే. తల్లి ఆదర్శంగా శ్రీలీల డాక్టర్‌ కావాలని అనుకుంది. కానీ అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ తన వైద్య విద్యను మధ్యలో వదిలి వేయకుండా పూర్తి చేసింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే శ్రీలీల ఎంబీబీఎస్ పరీక్షలు పూర్తి చేసింది.

పుష్ప 2 సినిమాలో శ్రీలీల చేసిన ఐటెం సాంగ్‌ పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్‌ హిట్‌ అయింది. కిస్సిక్‌ అంటూ సాగే శ్రీలీల ఐటెం సాంగ్‌కి మంచి స్పందన దక్కింది. ప్రస్తుతం ఈమె తమిళ్‌లో చేస్తున్న పరాశక్తిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమాలో శివ కార్తికేయన్‌కి జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. హిందీలో హౌస్‌ ఫుల్‌ 5 లో కీలక పాత్రలో కనిపించబోతుంది. పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్‌ చేసి సూపర్‌ హిట్‌ అయిన కారణంగానే శ్రీలీల ఒక్కసారిగా టాప్ స్టార్‌గా, పాన్‌ ఇండియా స్టార్‌గా మారి వరుసగా పెద్ద సినిమాల్లో, ఇతర భాషల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ ఉంది. తెలుగులో ఈమె త్వరలో మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.