రాశీఖన్నా జ్వరం, గొంతు నొప్పికి డాక్టర్ ఎవరో తెలుసా?
శ్రీలీల తన మెడిసిన్ చదువును నటనలో బిజీగా ఉన్నప్పుడే పూర్తి చేశారు. 2024-25 నాటికే తన వైద్య విద్యను పూర్తి చేసి.. అధికారికంగా డాక్టర్ పట్టా పొందారు.
By: Sivaji Kontham | 7 March 2026 11:21 PM ISTటాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కేవలం వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ ప్రాణాలు కాపాడే `డాక్టర్` అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ డాక్టర్ కం యాక్ట్రెస్ తన సాటి నటి రాశీ ఖన్నాకు వైద్యం చేసి వార్తల్లో నిలిచారు. గత కొద్ది రోజులుగా జ్వరం , గొంతు నొప్పితో బాధపడుతున్న రాశీ ఖన్నాకు శ్రీలీల చికిత్స అందించారు. ఈ విషయాన్ని రాశీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. నన్ను ఈ డాక్టర్ చాలా బాగా చూసుకున్నారు! అని ప్రశంసల వర్షం కురిపించారు.
రాశీ ఖన్నా తన పోస్ట్‌లో శ్రీలీలను ట్యాగ్ చేస్తూ.. ``అందరికీ నేను ఈ డాక్టర్ ని హైలీ రికమెండ్ చేస్తాను`` అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. షూటింగ్ సెట్స్‌లో రాశీకి అనారోగ్యం కలిగినప్పుడు.. శ్రీలీల తన వైద్య పరిజ్ఞానంతో ప్రాథమిక చికిత్స, సలహాలు అందించినట్లు తెలుస్తోంది. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే తన వృత్తి పట్ల శ్రీలీలకు ఉన్న నిబద్ధతను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
శ్రీలీల తన మెడిసిన్ చదువును నటనలో బిజీగా ఉన్నప్పుడే పూర్తి చేశారు. 2024-25 నాటికే తన వైద్య విద్యను పూర్తి చేసి.. అధికారికంగా డాక్టర్ పట్టా పొందారు. ప్రస్తుతం ఆమె పూర్తిస్థాయిలో హాస్పిటల్ ప్రాక్టీస్ చేయకపోయినా కానీ.. తన దగ్గరి వ్యక్తులకు.. ఇండస్ట్రీలోని సాటి నటీనటులకు అవసరమైనప్పుడు వైద్య సలహాలు ఇస్తూనే ఉన్నారు. సినిమాల్లో నటిస్తూనే ఈ స్థాయి బాధ్యతను నిర్వహించడం విశేషం.
శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే.. తను ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పాగా వేస్తోంది. టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ సరసన ప్రతిష్టాత్మక చిత్రం `ఉస్తాద్ భగత్ సింగ్` లో నటిస్తోంది. అలాగే రవితేజతో కలిసి RT75 ప్రాజెక్టులోనూ భాగమైంది. ఇవి కాకుండా మరికొన్ని భారీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.
బాలీవుడ్‌లో కూడా శ్రీలీల జైత్రయాత్ర మొదలైంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఈ బ్యూటీ నటించింది. తదుపరి వరుణ్ ధావన్ సరసన ఒక భారీ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన కూడా తన పేరు వినిపిస్తోంది. దక్షిణాదిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధులను చేసేందుకు సిద్ధమవుతోంది.
అటు వెండితెరపై నటిగా అలరిస్తూనే.. ఇటు డాక్టర్‌గా తన బాధ్యతను నెరవేరుస్తున్న శ్రీలీల మల్టీ-టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు. రాశీ ఖన్నా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
