శ్రీలీలకు కంబ్యాక్ ఇచ్చేది ఏ హీరో!
శ్రీలీలకు సరైన హిట్ పడి చాలా కాలమవుతుంది. 'భగవంత్ కేసరి' తర్వాత చాలా సినిమాలు చేసింది. కానీ అవేవి సక్సస్ తీరాన్ని చేరలేదు.
By: Tupaki Desk | 24 July 2025 12:35 PM ISTశ్రీలీలకు సరైన హిట్ పడి చాలా కాలమవుతుంది. 'భగవంత్ కేసరి' తర్వాత చాలా సినిమాలు చేసింది. కానీ అవేవి సక్సస్ తీరాన్ని చేరలేదు. మధ్యలో 'గుంటూరు కారం' యావరేజ్ గా ఆడింది. హీరోయిన్ గా నటించిన 'ఆదికేశవ', 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్','రాబిన్ హుడ్', లేటెస్ట్ రిలీజ్ 'జూనియర్' అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలే. చివరికి శ్రీలీల పరిస్థితి ఎలా అయిందంటే? ఆమె సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో? ఎప్పుడు పోతున్నాయో ? కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది.
దానికి తోడు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ అవకాశాల్ని కాదని ఇతర భాషలపై దృష్టి పెడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు సినిమా ఛాన్సులు వదులుకున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీలీల స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మరి ఆ సినిమా ఏది అవుతుందో చూడాలి. ప్రస్తుతం లైనప్ లో మాత్రం కొన్ని సినిమాలు కనిపిస్తున్నాయి. మాస్ రాజా రవితేజ హీరోగా 'మాస్ జాతర' తెరకెక్కుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. అలాగే పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' లోనూ ఈ బ్యూటీనే నటిస్తోంది.
అటు కోలీవుడ్ లో శివకార్తికేయన్ నటిస్తోన్న 'పరాశక్తి' లోనూ నటిస్తోంది. బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ తోనూ ఓ సినిమా చేస్తోంది. అదే ఆషీకి 3. ఇవన్నీ ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలు. ఈ చిత్రాల పై భారీ అంచనాలున్నాయి. మరి వీటిలో ఏ సినిమాతో హిట్ అందుకుని స్ట్రాంగ్ గా కంబ్యాక్ అవుతుందో చూడాలి. ముఖ్యం గా శ్రీలీల తెలుగు కంటే తమిళ్, హిందీ భాషలపైనే ఎక్కువ పోకస్ పెట్టి పని చేస్తోంది.
ఆ రెండు భాషల్లో చేస్తోన్న సినిమాలు మంచి విజయం సాధించాలని ఆశిస్తుంది. ప్రముఖంగా 'ఆషీకీ3' పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో హిట్ అందుకుంటే? రొమాంటిక్ స్టార్ గా ముద్ర పడుతుంది. యువతలో క్రేజ్ రెట్టింపు అవుతుంది. బాలీవుడ్ లో ఇంకా మంచి అవకాశాలు అందుకేనే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు నటనకు ఆస్కారం ఉంది. ఇలా ఇన్ని ఆశలతో 'ఆషీకీ 3' సక్సస్ కోసం ఎదురు చూస్తోంది.
