పిక్‌టాక్ : శ్రీలీలను మీ కార్ట్‌లో చేర్చుకోండి
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే శ్రీలీల తాజాగా సరదా పిక్స్ ను షేర్ చేసింది.
By: Tupaki Desk | 14 July 2025 3:39 PM ISTటాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీల మరో వైపు కోలీవుడ్, బాలీవుడ్‌లో తన అదృష్టంను పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో కన్నడంలో 'జూనియర్' సినిమాలో కొత్త హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ సినిమా విడుదలకు సిద్ధం అయింది. జూనియర్ సినిమా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కన్నడంలో రూపొందిన జూనియర్ సినిమాను తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం శ్రీలీల నటించిన కారణంగా జూనియర్ సినిమాకు తెలుగు మార్కెట్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక శ్రీలీల రెగ్యులర్‌గా సోషల్ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉండే శ్రీలీల తాజాగా సరదా పిక్స్ ను షేర్ చేసింది. షాపింగ్ మాల్‌లో ఉండే కార్ట్‌లో కూర్చుని ఉన్న ఫోటోలను షేర్ చేసి సరదాగా 'నన్ను మీ కార్ట్ లో యాడ్' చేసుకోండి అంటూ కామెంట్ జోడించింది. శ్రీలీల అందమైన స్టైలిష్ లుక్‌లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీలీల అలా కార్ట్‌లో కూర్చుని ఫోటోలకు ఫోజ్ ఇస్తే చాలా క్యూట్‌గా అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీలను ఇప్పటికే చాలా మంది తమ కార్ట్‌లో యాడ్ చేసుకుని అభిమానించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలతో మరింత మందికి ఆమె చేరువ కావడం ఖాయం.
హిందీలో ఈమె నటిస్తున్న కార్తీక్ ఆర్యన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొన్నటి వరకు ఈ సినిమాకు ఆషికీ 3 అనే టైటిల్‌ను అనుకున్నారు. దర్శకుడు కూడా అదే టైటిల్‌తో విడుదల చేయాలని భావించాడు. కానీ ఆషికి అనగానే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అనే అభిప్రాయం అందరికీ కలుగుతుంది. అందుకే ఈ సినిమాపై అలాంటి ఉద్దేశం కలుగకూడదు అనే ఉద్దేశంతో మరో టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో. ఆయన నటించిన పలు సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
టాలీవుడ్‌లోనూ శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది. రవితేజతో కలిసి మాస్ జాతర సినిమాలో నటిస్తోంది. ధమాకా సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో మాస్ జాతర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అనే విశ్వాసం ను అంతా వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల అందాల ఔట్ ఫిట్‌లో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోటోలు షేర్ చేస్తే ఎప్పటికప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇలా సరదాగా కార్ట్ లో కూర్చుని ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన ఫోటోలు కూడా భలే ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందంగా ముద్దుగా ఉన్న శ్రీలీలను మీరు మీ కార్ట్‌లో యాడ్ చేసుకున్నారా..!
