శ్రీలీల డబుల్ గేమ్ వర్కౌట్ అవుద్దా!
తెలుగు హీరోయిన్ శ్రీలీల చెప్పుకోవడానికి చాలా తెలుగు సినిమాలు చేసింది. కానీ నటిగా మాత్రం తన స్పెషాల్టీ మాత్రం ఇంతవరకూ ఏ సినిమాలోనూ హైలైట్ అవ్వలేదు.
By: Tupaki Desk | 8 April 2025 1:00 PM ISTతెలుగు హీరోయిన్ శ్రీలీల చెప్పుకోవడానికి చాలా తెలుగు సినిమాలు చేసింది. కానీ నటిగా మాత్రం తన స్పెషాల్టీ మాత్రం ఇంతవరకూ ఏ సినిమాలోనూ హైలైట్ అవ్వలేదు. కొన్ని సినిమాల్లో సెకెండ్ లీడ్ కు పరిమితమవ్వడం..మరికొన్ని సినిమాల్లో పూర్తి స్థాయిలో నటనకు ఆస్కారం లేకపోవడంతో? శ్రీలీల రేసులో వెనుకబడింది అనడంలో వాస్తవం ఉంది. దీంతో చెప్పుకోవడానికి భారీ హిట్లు అంటూ లేవు.
అలాగే నటన పరంగా సంథింగ్ స్పెషల్ గానూ శ్రీలీల ఏ సినిమాలోనూ హైలైట్ అవ్వలేదు. పైగా ఇటీవల రిలీజ్ అయిన `రాబిన్ హుడ్` కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. హిట్ అయితే కెరీర్ పరంగా ఎంతో కొంత కలిసొచ్చేది. దీంతో శ్రీలీల గ్రాఫ్ భారీగా డౌన్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతానికి తెలుగులో రెండు అవకాశాలు చేతిలో ఉన్నాయి అందులో ఒకటి రవితేజ సరసన `మాస్ జాతర`లో నటిస్తోంది.
అలాగే అఖిల్ హీరోగా నటిస్తోన్న `లెనిన్` చిత్రంలోనూ నటిస్తోంది. శ్రీలీలకు ఈ రెండు మంచి అవకాశాలే. ఆ రెండు శ్రీలీల నటనకు ఆస్కారం పాత్రలై ఉండాలి.ఈ రెండు సినిమాలు శ్రీలీల కెరీర్ కి అత్యంత కీలకమైనవి. హిట్ అయితే ఛాన్సుల రేసులో కనిపిస్తుంది. లేదంటే? కష్టమే అన్న చర్చ సాగుతుంది. అయితే లక్కీగా బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడం అన్నది శ్రీలీలకు అతి పెద్ద ఊరట లాంటింది.
టాలీవుడ్ లో ఫెయిలైనా బాలీవుడ్ లో చూసుకుందాం? అన్న ధీమా శ్రీలీలలో కనిపిస్తోంది. ఆ కారణంగానే తెలుగు సినిమాలపై ఫోకస్ చేయలేదా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ కి జోడీగా ఓ సినిమా చేస్తోంది. మరో బిగ్ ప్రొడక్షన్ హౌస్ లోనూ కొత్త సినిమాకు సైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సక్సస్ అయితే శ్రీలీల చలాకీతనంతో బాలీవుడ్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయి.
