Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి దూరమవనున్న శ్రీలీల..?

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఈమధ్య కాస్త దూకుడు తగ్గించినట్టు కనిపించినా మళ్లీ అమ్మడు ఫాం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఐతే ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మాత్రమే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది.

By:  Tupaki Desk   |   16 Jun 2025 8:45 AM IST
టాలీవుడ్ కి దూరమవనున్న శ్రీలీల..?
X

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఈమధ్య కాస్త దూకుడు తగ్గించినట్టు కనిపించినా మళ్లీ అమ్మడు ఫాం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఐతే ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మాత్రమే కాదు తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో అమ్మడు ఆషికి 3 సినిమాలో నటిస్తుంది. అనురాగ్ బసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తుండగా శ్రీలీల లక్కీ ఛాన్స్ అందుకుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన టీజర్ ఇంప్రెస్ చేసింది.

ఆషికి 2 సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వగా ఆషికి 3 సినిమా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఆషికి లవ్ స్టోరీస్ కి బాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆషికి 2 తర్వాత శ్రద్ధ కపూర్ టాప్ రేంజ్ కి వెళ్లింది. ఐతే ఇప్పుడు ఆషికి 3 చేస్తున్న శ్రీలీలకు కూడా బీ టౌన్ స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆషికి 3 సినిమా అనుకున్న విధంగా యూత్ ఆడియన్స్ కి ఎక్కేస్తే మాత్రం శ్రీలీల అక్కడ స్టార్ డం తెచ్చుకున్నట్టే. సౌత్ లో ఆల్రెడీ తన మార్క్ నటనతో అలరిస్తూ వస్తున్న శ్రీలీల బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో చేస్తున్న తొలి సినిమానే ఒక బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ అవ్వడం తో అమ్మడి మీద అందరి దృష్టి ఉంది.

తప్పకుండా ఆషికి 3 సినిమా సక్సెస్ అయితే మాత్రం శ్రీలీలని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. అంతేకాదు హిందీ పరిశ్రమలో బిజీ అయితే మాత్రం కచ్చితంగా టాలీవుడ్ కి శ్రీలీల దూరమయ్యే అవకాశం ఉంది. తెలుగులో ప్రస్తుతం శ్రీలీల రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తుంది. తమిళ్ లో కూడా శివ కార్తికేయన్ పరాశక్తి లో నటిస్తుంది. సో ఆషికి 3 సక్సెస్ ని బట్టి హిందీలో శ్రీలీల కెరీర్ ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.

శ్రీలీల కేవలం యాక్టింగ్ తోనే కాదు తన డ్యాన్స్ తో కూడా మెస్మరైజ్ చేస్తుంది. బాలీవుడ్ ఆడియన్స్ డ్యాన్స్ ప్రియులు కాబట్టి శ్రీలీల డ్యాన్స్ లకు కూడా వాళ్లు ఎట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆషికి 3 టైం లోనే కార్తీక్ ఆర్యన్ తో క్లోజ్ గా ఉంటున్న శ్రీలీలని చూసి కార్తీక్ తో ఆమె డేటింగ్ లో ఉందంటూ హడావిడి చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఒక సూపర్ క్లాసిక్ సినిమాతో జరగడం ఆమె లక్కీ అని చెప్పొచ్చు.