Begin typing your search above and press return to search.

శ్రీలీల‌కు కెరీర్ ట‌ర్నింగ్ ఛాన్స్ వ‌చ్చిందా?

టాలీవుడ్ డాల్ శ్రీలీల బాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క హిట్ ప్రాంచైజీ 'ఆషీకీ-3'తో ఎంట్రీ ఇస్తుంది.

By:  Tupaki Desk   |   9 May 2025 11:00 PM IST
Sreeleela Bags Back-to-Back Bollywood Projects
X

టాలీవుడ్ డాల్ శ్రీలీల బాలీవుడ్ లోనూ లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క హిట్ ప్రాంచైజీ 'ఆషీకీ-3'తో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో అమ్మ‌డు కార్తీక్ ఆర్య‌న్ కి జోడీగా న‌టిస్తోంది. 'ఆషీకి' నుంచి రిలీజ్ అయిన రెండు చిత్రాలు భారీ విజ‌యాలు సాధించాయి. 'ఆషీకీ-2' టాలీవుడ్ లో కూడా రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి హిట్ చిత్రంతో కిసిక్ బ్యూటీ ఎంట్రీ ఇవ్వ‌డంతో పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది.

కార్తీక్ ఆర్యన్ తో అమ్మ‌డు రొమాంటిక్ పెర్పార్మెన్స్ తో అద‌ర‌గొడుతుంద‌ని మంచి అంచనాలున్నాయి. 'ఆషీకీ -2' మంచి ఇంటిమేట్ స‌న్నివేశాలుంటాయ‌ని ప్ర‌చారం జోరుగా సాగుతుంది. అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉండ‌గానే శ్రీలీల మ‌రో ఛాన్స్ అందుకున్న‌ట్లు తెలుస్తోంది.

యంగ్ హీరో సిద్దార్ధ్ మ‌ల్హోత్రాకి జోడీగా ఎంపికైందట‌. రాజ్ సాండియాలా త‌దుప‌రి చిత్రం ఈ కాంబినేష‌న్ లో రూపొందుతుంద‌ని స‌మాచారం. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ కావ‌డంతో స్టార్ డైరెక్ట‌ర్ ఆనంద్. ఎల్ రాయ్ నిర్మా త‌గా ముందుకొస్తున్నాడట‌. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాత అంటే చిన్న విష‌యం కాదు. ఆయ‌న స్వీయా ద‌ర్శక‌త్వంలోనే చాలా సినిమాల నిర్మాణం జ‌రిగింది. మ‌ధ్య‌లో కొంత కాలం ద‌ర్శ‌క‌త్వానికి బ్రేక్ ఇచ్చినా మ‌ళ్లీ ఈ మ‌ధ్య కాలంలో స్పీడందుకున్నారు.

ఈ క్ర‌మంలో త‌న క‌థ‌ల్ని తానే నిర్మిస్తున్నారు. బ‌య‌ట క‌థ‌ల‌పై అంత‌గా దృష్టి పెట్ట‌లేదు. అయితే రాజ్ సాండియాలా డిఫ‌రెంట్ స్టోరీతో మెప్పించ‌డంతో ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీలీలకు ఆఫ‌ర్ నిజ‌మైతే అమ్మ‌డు ల‌క్కీగాళ్ అవుతుంది. పెర్పార్మెన్స్ తో మెప్పించ‌గ‌ల్గితే ఆనంద్ .ఎల్ . రాయ్ చిత్రంలోనే కిసిక్ బ్యూటీకి ఛాన్స్ వ‌చ్చేస్తుంది.