కిసిక్ బ్యూటీ కసెక్కించే జోరుతో!
శ్రీలీల బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులందుకుంటుంది.
By: Tupaki Desk | 12 May 2025 7:09 AMశ్రీలీల బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులందుకుంటుంది. ఒక్క సినిమా రిలీజ్ అవ్వకుండానే మరో రెండు చిత్రాలకు సైన్ చేసిందంటే? అమ్మడు జోరు అక్కడ ఏ రేంజ్ లో కొనసాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రతిష్టాత్మక హిట్ ప్రాంచైజీ `ఆషీకీ-3`తో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ కి జోడీగా నటిస్తోంది. `ఆషీకి` నుంచి రిలీజ్ అయిన రెండు చిత్రాలు భారీ విజయాలు సాధించడంతో మూడవ భాగంపై భారీ అంచనాలున్నాయి. ఇలాంటి లవ్ స్టోరీతో శ్రీలీల ఎంట్రీ ఇవ్వడంతోనే రిలీజ్ కు ముందే అమ్మడు అక్కడ ఫేమస్ అయిపోతుంది.
కార్తీక్ ఆర్యన్ తో రొమాంటిక్ సన్నివేశాల శ్రీలీల చెలరేగడం ఖాయం. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న చిత్రం దీపావళికి రిలీజ్ అవుతుంది. ఈసినిమా సెట్స్ లో ఉండగానే యంగ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాకి జోడీగానూ ఎంపికైంది. రాజ్ సాండియాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మాత కావడం మరో విశేషం. శ్రీలీల పెర్పార్మెన్స్ నచ్చిందంటే ఆనంద్ ఎల్. రాయ్ తన దర్శక త్వంలోనే ఛాన్స్ ఇవ్వడం ఖాయమే.
ఈ రెండు సినిమాల సంగతి పక్కన బెడితే అమ్మడిప్పుడు ఏకంగా బడా బ్యానర్లోకే ఎంటర్ అవుతున్నట్లు సమాచారం. శ్రీలీలపై ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ కన్నుపడింది. ఆయన హిట్ ప్రాంచైజీ `దోస్తానా 2`లో శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఛాన్స్ స్వయంగా కరణ్ జోహార్ తీసుకున్నాడని వినిపిస్తుంది. తొలుత ఆయన కొంత మంది సౌత్ భామల పేర్లను పరిశీలించారుట.
ఈ క్రమంలో సౌత్ నుంచి వచ్చి నార్త్ లో సినిమాలు చేస్తోన్న పేర్లను పరిశీలించి శ్రీలీల అయితే బాగుం టుందని ఎంపిక చేసినట్లు వినిపిస్తుంది. ఈ అవాకశం నిజమైతే శ్రీలీల జాతకం మారిపోతుంది. టాలీవుడ్ లో సాధించలేనిది బాలీవుడ్ లో సాధిస్తుంది. అమ్మడి చలాకీతనానికి అక్కడ కనెక్ట్ అవ్వడం సులభమే.