పక్కింటి అమ్మాయిలా భగత్ సింగ్ ప్రేయసి
ఇక ఇందులో శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ నెవ్వర్ బిఫోర్ అనేలా పక్కింటి అమ్మాయి తరహాలో ఆకట్టుకుంటుందని సమాచారం.
By: Tupaki Desk | 14 Jun 2025 1:09 PM ISTపవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జోరుగా జరుగుతోంది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ నెవ్వర్ బిఫోర్ అనేలా పక్కింటి అమ్మాయి తరహాలో ఆకట్టుకుంటుందని సమాచారం.
అయితే జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌లో ఆమె ఆరెంజ్ చుడిదార్ డ్రెస్‌లో, చేతిలో కాఫీ కప్ పట్టుకుని రిలాక్స్ అవుతున్న స్టైల్‌లో కనిపించింది. ఈ లుక్ ఫ్యాన్స్‌ను చాలా ఆకట్టుకుంది. అలాగే ఈ పోస్టర్‌తో శ్రీలీల అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అన్న ఆసక్తి పెరిగింది.
పవన్ కళ్యాణ్‌తో ఆమె కెమిస్ట్రీ థియేటర్స్‌లో ఎలా ఉంటుంది అనే విషయంపై అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక డీఎస్పీ సంగీతం, హరీష్ శంకర్ టేకింగ్ సినిమాకు బలాన్ని ఇస్తాయని టాక్. శ్రీలీల సెట్స్‌పై చాలా చురుకుగా ఉంటుందని టీం చెబుతోంది. టీం అందరితో కలిసిమెలిసి ఉంటూ, ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపిస్తుందని మెచ్చుకుంటున్నారు.
ఆమె పనితనంతో దర్శకుడు, నిర్మాతల ప్రశంసలు పొందిందట. ఈ బర్త్‌డే సందర్భంగా శ్రీలీలకు టీమ్ ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈమధ్య కాలంలో కాస్త స్లో అయినప్పటికీ ఈ సినిమా శ్రీలీల కెరీర్‌కి ఒక మంచి అవకాశమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆమెపై ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా విజయవంతం అయితే, శ్రీలీలకి ఫాలోయింగ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
మరోవైపు శ్రీలీల రవితేజ మాస్ జాతర సినిమాతో పాటు అఖిల్ తో లెనిన్ అనే సినిమాతో బిజీగా ఉంది. తమిళంలో కూడా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో కూడా అవకాశాలు పెరిగే విధంగా అడుగులు వేస్తోంది. ఆశికి 3లో కార్తిక్ ఆర్యన్ కు జోడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అమ్మడికి రానున్న రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.
