Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : బర్త్‌డే బేబీ క్యూట్‌ పిక్స్‌

పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల.

By:  Tupaki Desk   |   16 Jun 2025 5:34 PM IST
పిక్‌ టాక్‌ : బర్త్‌డే బేబీ క్యూట్‌ పిక్స్‌
X

పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు మూలాలు ఉండటంతో టాలీవుడ్‌లో చక్కగా రాణించగలుగుతోంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. మొదటి సినిమా పెళ్లి సందడి తీవ్రంగా నిరాశ పరచినా కూడా ఆ తర్వాత చేసిన సినిమాలు ఈ అమ్మడికి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా రవితేజతో కలిసి ఈమె చేసిన ధమాకా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. రవితేజతో ఈమె చేసిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ అమ్మడు ఒకే సారి ఆరు.. ఏడు ప్రాజెక్ట్‌లు చేసింది.

గత ఏడాది ఈ అమ్మడు మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పరచినా కూడా హీరోయిన్‌గా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టడంతో పాటు, హీరోయిన్‌గా మరిన్ని ఆఫర్లు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్‌లు చేసేందుకు గాను పుష్ప 2 సినిమాలోని ఐటెం సాంగ్‌ ప్రముఖంగా ఉపయోగపడింది. పుష్ప 2 సినిమాలో ఈమె చేసిన ఐటెం సాంగ్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో ఓ ఊపు ఊపింది. అందుకే ఈమెకు హిందీ, తమిళ భాషల్లోనూ పలు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి.

తాజాగా శ్రీలీల తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. అంతే కాకుండా ఈమె తన బర్త్‌డే కి వచ్చిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియజేసింది. పుట్టిన రోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఇలా క్యూట్‌ ఫోటోలు షేర్ చేసింది. తన పుట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం శ్రీలీల పలు సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడంకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఈమె ఈ ఏడాదిలో తమిళ్ మూవీ తో రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిందీలో కూడా ఈమె నటించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ అమ్మడికి ఈ ఏడాది చాలా పెద్దగా ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు. తెలుగులో ఈమె చేయబోతున్న సినిమాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు, డాన్స్ విషయంలో ఈ అమ్మడిని మించిన వారు టాలీవుడ్‌లో ఎవరు లేరు అని అభిమానులు అంటూ ఉంటారు. ఇదే విధంగా నటనతోనూ ఆకట్టుకుంటూ ఉంది.