బుట్టలో శ్రీలీల.. పెళ్లి కాదు ఆ వేడుక అంట కద..!
మా ఇంట్లో బర్త్ డే వేడుకలు ఇలానే జరుగుతాయి అంటూ ఆమెను బుట్టలో ఎత్తిన ఫోటోని తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది శ్రీలీల.
By: Tupaki Desk | 31 May 2025 8:17 PM ISTటాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీలీల ఏం చేసినా సరే సోషల్ మీడియాలో మంచి డిస్కషన్ పాయింట్ గా మారుతుంది. మొన్నటిదాకా తెలుగు, కన్నడ సినిమాలతోనే అలరించిన అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కార్తీక్ ఆర్యన్ తో ఒక క్రేజీ సినిమా చేస్తుంది శ్రీలీల. సౌత్ హీరోయిన్ కాస్త ఆ ప్రాజెక్ట్ చేస్తుంది కాబట్టి ముంబై మీడియా కూడా శ్రీలీల మీద ఫోకస్ పెట్టింది. ఆమె ఏం చేస్తుంది ఎవరిని కలుస్తుంది అంటూ నానా హంగామా చేస్తున్నారు.
ఐతే లేటెస్ట్ గా శ్రీలీల ఇంట్లో ఒక సెలబ్రేషన్ మళ్లీ ఆమెను వార్తల్లో నిలబెట్టేలా చేసింది. శ్రీలీల అందంగా ముస్తాబయ్యి కట్టు బొట్టుతో పాటు గంధం కూడా పూసుకుని కనిపించింది. ఈ ఫోటోలు చూసి శ్రీలీల ఎంగేజ్మెంట్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో కొందరు హడావుడి మొదలు పెట్టారు. అసలు శ్రీలీల ఈ వేడుక వెనక రీజన్స్ ఏంటి అని తెలుసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఐతే వాళ్లకి మరీ అంత టఫ్ ఇవ్వడం ఇష్టం లేని శ్రీలీల చిన్నగా తన ఇంట్లో వేడుక గురించి లీక్ చేసింది.
మా ఇంట్లో బర్త్ డే వేడుకలు ఇలానే జరుగుతాయి అంటూ ఆమెను బుట్టలో ఎత్తిన ఫోటోని తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది శ్రీలీల. ఐతే నిజంగానే ఆ ఫోటో చూస్తే అది బర్త్ డే వేడుకల్లో భాగం అన్నట్టుగా లేదు నిజంగానే శ్రీలీలని పెళ్లి కూతురుగా చేసి బుట్టలో ఎత్తుకొస్తున్నట్టు ఉంది. మరి బర్త్ డేకి ఈ రేంజ్ హంగామా ఏంటో అనుకుంటే ఈ క్రెడిట్ అంతా కూడా తన మదర్ దే అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.
శ్రీలీల అంటే ఆమె మదర్ కి చాలా ఇష్టం. అదేంటి ఏ తల్లికైనా తన పిల్లలంటే ఇష్టమే అనుకోవచ్చు. అది నిజమే కానీ ఎవరికి వారు అలా ప్రత్యేకం అనుకుంటారు కద ఇది కూడా అలానే అన్నమాట. ఇక హీరోయిన్ గా రాణిస్తున్న శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రవితేజతో మాస్ జాతర సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు తమిళ్ లో శివ కార్తికేయన్ తో పరాశక్తి సినిమా చేస్తుంది. ధమాకా తర్వాత రవితేజతో చేస్తున్న సినిమా అవ్వడం తో మాస్ జాతర మీద భారీ అంచనాలు ఉన్నాయి.
