Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడికి లిటిల్ అమ్ములు బర్త్‌డే విష్‌

దర్శకేంద్రుడు చివరిగా పెళ్లి సందడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   24 May 2025 12:13 PM IST
Sreeleela Heartfelt Message To Raghavendra Rao
X

టాలీవుడ్‌కి ఎంతో మంది స్టార్స్‌ను పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్ర రావు. శతాధిక చిత్రాల దర్శకుడిగా రాఘవేంద్ర రావు టాలీవుడ్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానంను దక్కించుకున్నారు. ఇండస్ట్రీలో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఆయన దర్శకత్వంలో మూడు తరాల హీరోలు నటించారు. పదుల కొద్ది స్టార్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత దక్కించుకున్నారు. ఒకప్పుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తమ వారసుడిని పరిచయం చేయాలని ఎంతో మంది హీరోలు, దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపించే వారు. అలాంటి రాఘవేంద్ర రావు ఈ మధ్య కాలంలో సినిమాలు తీయక పోవడం ఆయన ఫ్యాన్స్‌కి నిరుత్సాహం కలిగిస్తుంది.


దర్శకేంద్రుడు చివరిగా పెళ్లి సందడి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమాకు దర్శకత్వం వహించలేదు.. నిర్మాతగా మాత్రమే వ్యవహరించారు. అయితే తెర వెనుక నడిపించింది మొత్తం గురువు గారే అంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆ విషయం పక్కన పెడితే పెళ్లి సందడి సినిమాతో శ్రీలీలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటికే కన్నడంలో నటించిన శ్రీలీల తెలుగులో రాఘవేంద్ర రావు సినిమాతో పరిచయం కావడంతో ఒక్కసారిగా స్టార్‌ అయింది. పెళ్లి సందడి సినిమా ప్లాప్‌ అయినా కూడా శ్రీలీలకు మంచి గుర్తింపు లభించింది. శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ పొజీషన్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

శ్రీలీల టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్‌ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. తనకు ఇంతటి క్రేజ్‌, గుర్తింపు దక్కడంకు కారణం రాఘవేంద్ర రావు అని శ్రీలీల ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. తాజాగా దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా శ్రీలీల తన అభిమానంను చాటుకుంది. రాఘవేంద్ర రావుకు సోషల్‌ మీడియా ద్వారా హృదయపూర్వకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. హ్యాపీ బర్త్‌డే రాఘవేంద్ర రావు గారు, నన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. మీరు అంటే ఎప్పటికీ గౌరవం ఉంటుంది అంటూ మీ లిటిల్‌ అమ్ములు అంటూ పోస్ట్‌ పెట్టింది.

రాఘవేంద్ర రావును హగ్‌ చేసుకుని ఉన్న ఫోటోను సైతం శ్రీలీల షేర్‌ చేసింది. మొత్తానికి రాఘవేంద్ర రావుపై తనకు ఉన్న గౌరవంను శ్రీలీల ఇలా చూపించింది. ఇండస్ట్రీలో ఎంతో మందికి రాఘవేంద్ర రావు లైఫ్‌ ఇచ్చారు. శ్రీలీల మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ రాఘవేంద్ర రావును ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అల్లు అర్జున్‌ సైతం రాఘవేంద్ర రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నా మొదటి దర్శకుడు, నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎప్పటికీ మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను అంటూ పోస్ట్‌ చేశాడు.