Begin typing your search above and press return to search.

శ్రీలీల ప్రేమక‌థ ఇప్ప‌ట్లో క‌ష్టం!

తెలుగు హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 April 2026 10:29 AM IST
శ్రీలీల ప్రేమక‌థ ఇప్ప‌ట్లో క‌ష్టం!
X

తెలుగు హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేమికుల మనసు గెలుచుకున్న ఐకానిక్ ఫ్రాంచైజ్ `ఆషీకీ 3`లో అమ్మ‌డు నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అమ్మ‌డు బోల్డ్ పెర్పార్మెన్స్ తో ఎలా అల‌రిస్తుంద‌నే ఉత్కంఠ నెల‌కొంది. అనురాగ్ బ‌స్ ద‌ర్శ‌క‌ త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంపై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతు న్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని త్వరలోనే విడుదలవుతుందనే ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది.

తాజాగా అలా భావించిన వారందరికీ దర్శకుడు అనురాగ్ బసు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రేమకథ రిలీజ్ అవ్వ‌డానికి ఇంకా చాలా సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు కేవలం 45 రోజులు మాత్రమే చిత్రీకరణ జరిగిందని వెల్లడించారు. `ఆషీకీ' వంటి సెన్సిటివ్ సబ్జెక్టును ఎలా ప‌డితే? అలా తీసి రిలీజ్ చేసే చిత్రం కాద‌న్నారు. ఎంతో ఓపిక‌తో చేయాల్సిన షూటింగ్ అని..తాను అనుకున్న విధంగానే ఎమోష‌న్స్ అన్నీ ప‌క్కాగా వ‌చ్చే వ‌ర‌కూ షాట్ ఒకే చేయ‌డం లేద‌న్నారు. సోష‌ల్ మీడియాలో షూటింగ్ ముగింపు దశకు వచ్చిందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం 45 రోజుల షూటింగ్ మాత్ర‌మే పూర్త‌యింద‌న్నారు. మిగిలిన భాగం పూర్తి కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం జమ్మూ కశ్మీర్‌లోని అందమైన లోయల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రేమకథలకు పెట్టింది పేరుగా నిలిచే కశ్మీర్ లొకేషన్లలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ - శ్రీలీల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు , పాటలను అత్యంత కళాత్మకంగా తెరకెక్కించేందుకు అనురాగ్ బసు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రకృతి సిద్ధమైన అందాల మధ్య ఈ జంట కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.

అనురాగ్ బసు మేకింగ్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. విజువల్స్ , సంగీతం విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడరు. `ఆషీకీ 3` వంటి మ్యూజికల్ హిట్ సిరీస్ కావడంతో పాటల చిత్రీకరణకు , ఎమోషనల్ సీన్లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి కనీసం మరో ఏడాది పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీలీలకు ఇది బాలీవుడ్‌లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. టాలీవుడ్‌లో డ్యాన్స్‌లు , ఎనర్జీతో మెప్పించిన బ్యూటీ హిందీలో తన నటనతో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

కార్తీక్ ఆర్యన్ లాంటి క్రేజీ స్టార్ పక్కన న‌టించ‌డం ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్. అయితే సినిమా విడుదల ఆలస్యం కావడం వల్ల ఆమె బాలీవుడ్ కెరీర్ ప్లానింగ్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీలీల‌ మరికొన్ని హిందీ ప్రాజెక్టుల కోసం చర్చలు జ‌రుపుతోంది. వాటిలో కొన్నింటిని క‌మిట్ అయింది. ఈ నేప‌థ్యంలో వాటిలో ఏ సినిమా షూట్ పూర్త‌యినా ముందుగా ఆ సినిమాతోనే అమ్మ‌డి బాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది.