Begin typing your search above and press return to search.

నీకు నువ్వే ఉత్త‌మ‌మైన‌ ఛీర్ లీడ‌ర్: శ్రీ‌జ కొణిదెల‌

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల 2023లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:04 AM GMT
నీకు నువ్వే ఉత్త‌మ‌మైన‌ ఛీర్ లీడ‌ర్: శ్రీ‌జ కొణిదెల‌
X

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల 2023లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌జ‌ ఇద్దరు పిల్లలకు తల్లి. త‌న రెండవ భర్త నుంచి విడిపోయిన అనంత‌రం కొత్త జ‌ర్నీకి సంబంధించిన విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో ఓపెన్ గా వెల్ల‌డిస్తున్నారు.

తాను తన బలాన్ని కనుగొన్నానని.. కొత్త‌ ప్రయాణం ప్రారంభమైందని సోషల్ మీడియాలో ప్రకటించ‌డం త‌నలోని మ‌నోధైర్యాన్ని ఆవిష్క‌రించింది. తాజాగా శ్రీ‌జ కొణిదెల ఒక కొత్త ఫోటోని షేర్ చేసి దానికి అంద‌మైన క్యాప్ష‌న్ ని ఇచ్చారు. యు ఆర్ యువ‌ర్ బెస్ట్ ఛీర్ లీడ‌ర్! (నీకు నువ్వే ఉత్త‌మ‌మైన ఛీర్ లీడ‌ర్) అన్న‌దే ఆ క్యాప్ష‌న్. శ్రీ‌జ చెమ‌ట‌ల‌తో త‌డిసిన ఈ ఫోటోని చూస్తుంటే తాను జిమ్ సెష‌న్ లో ఉన్నార‌ని భావించాల్సి ఉంటుంది.

ఇక ఈ స్నాప్ తో పాటు విజువ‌ల్ లో క‌నిపిస్తున్న ఆ పంక్తుల‌ మీనింగ్ ఇలా ఉంది. ''రెండ‌డుగులు ముందుకు ఒక‌డుగు వెన‌క్కి..! ఇది కూడా ముందుకు సాగే ప్ర‌యాణం! అంటూ అంద‌మైన క్యాప్ష‌న్ ని ఈ స్నాప్ కి ఇచ్చింది. చేసే ప‌నిలో సూక్ష్మ‌మైన‌ ప్ర‌గ‌తిని సాధించినా కానీ దానిని సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని కూడా శ్రీ‌జ అంది. చూస్తుంటే ఇటీవ‌ల శ్రీ‌జ కూడా ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారి జిమ్ లో శ్ర‌మిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇందులో ప్ర‌గ‌తిని సాధించారు గ‌నుకే ఈ ఆనందం.