శ్రీ విష్ణు లైనప్ మామూలుగా లేదుగా!
ఈ సినిమా రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు ఇప్పటికే మరో మూడు చిత్రాలకు సైన్ కూడా చేయడం విశేషం.
By: Tupaki Desk | 7 May 2025 3:30 PMటాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్‌పై బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో సూపర్ ఫాస్ట్ వేగంతో దూసుకెళ్తోంది. ఈనెల 9వ తేదీన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ సింగిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమా ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ హ్యాపీ మోడ్‌లో ఉంది.
ఈ సినిమా రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న శ్రీవిష్ణు ఇప్పటికే మరో మూడు చిత్రాలకు సైన్ కూడా చేయడం విశేషం. బాక్సాఫీస్ వద్ద సింగిల్ మంచి విజయం సాధిస్తే ఆ జోష్‌తో తదుపరి మూడు చిత్రాలను మరింత వేగంగా పూర్తి చేయాలనే పట్టుదలతో శ్రీవిష్ణు ఉన్నాడని తెలుస్తోంది. ఈ మూడు సినిమాల కోసం కూడా శ్రీ విష్ణు కొత్తదనం కనిపించే విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకున్నాడని సమాచారం.
అమృతం వీక్లీ సీరియల్ దర్శకుడు, సహా నిర్మాత గున్నం గంగరాజు జస్ట్ ఎల్లో బ్యానర్‌పై మృత్యుంజయ అనే ఆసక్తికర ప్రాజెక్టులో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్నాడు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 30 రోజుల షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. దీని తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథకు శ్రీవిష్ణు ఓకే చెప్పాడట. త్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమవనుందని తెలుస్తోంది.
ఈ రెండు సినిమాల తర్వాత పూర్తి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మూవీను శ్రీవిష్ణు చేయనున్నాడని సమాచారం. ఈ సినిమా షూటింగ్ వర్షాకాలంలో ప్రారంభమవనుందని తెలుస్తోంది. అయితే ఈ మూడు చిత్రాలు వచ్చే ఏడాది వేసవి నుంచి విడుదల కానున్నాయని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినపడతోంది. ఈ మూడు ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇక సింగిల్ మూవీ విషయానికి వస్తే పూర్తి వినోదాత్మకమైన కథగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డైరెక్టర్ కార్తీక్‌రాజు తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా కేతిక శర్మ, ఇవానా నటించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించాడు. శ్రీవిష్ణు, కిశోర్ మధ్య కామెడీ ట్రాక్‌లు అద్భుతంగా పండినట్టు చిత్ర యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.