సింగిల్ టీం కి షాక్ ఇచ్చిన అల్లు అరవింద్..!
శ్రీవిష్ణు లీడ్ రోల్ లో కార్తీక్ రాజు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సింగిల్. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన ఇవానా, కెతిక శర్మ హీరోయిన్స్ గా నటించారు.
By: Tupaki Desk | 25 April 2025 4:55 PMశ్రీవిష్ణు లీడ్ రోల్ లో కార్తీక్ రాజు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సింగిల్. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన ఇవానా, కెతిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని మే 9కి లాక్ చేశారు. ఐతే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పై శ్రీవిష్ణు, ఇవానా, వెన్నెల కిశోర్ డైరెక్టర్ కార్తీక్ రాజు అల్లు అరవింద్ తో చేసిన ఒక స్పెషల్ డిస్కషన్ వీడియో చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
సింగిల్ సినిమాను మే 9న రిలీజ్ చేస్తే బాగుంటుందని హీరో శ్రీవిష్ణు అల్లు అరవింద్ కి చెబుతాడు. మే 9న ఎన్నో ప్రేమకథలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయని చెబుతాడు. మరోచరిత్ర, ప్రేమించుకుందాం రా సినిమాలతో పాటు గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు లాంటి సినిమాలు ఆ డేట్ న రిలీజై సూపర్ హిట్ అయ్యాయని అంటాడు శ్రీవిష్ణు. అంతేకాదు ఇవానా లవ్ టుడే సినిమా పూజ కూడా మే 9న పెట్టారని వెన్నెల కిశోర్ చెబుతాడు.
సో మే 9న సింగిల్ సినిమా రిలీజ్ డేట్ చేయాలని అల్లు అరవింద్ ని ఒప్పించే ప్రయత్నంలో వీరంతా ఇలా చెబుతుండగా అటు నుంచి ఒకతను వచ్చి మేడ సినిమా రిలీజ్ ని మే 9న ఫిక్స్ చేశారని అంటాడు. ఎవరు అంటే అల్లు అరవింద్ పేరు చెబుతాడు. సో ఆల్రెడీ ఆయన మే 9న రిలీజ్ అని ఫిక్స్ అయితే ఆ డేట్ న సింగిల్ సినిమా రిలీజ్ కోసం అల్లు అరవింద్ ని కన్విన్స్ చేసేందుకు వెళ్తారు. ఈ వీడియో ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది.
ఇక సింగిల్ సినిమా విషయానికి శ్రీవిష్ణు నుంచి వస్తున్న మరో సూపర్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై బజ్ ఏర్పరిచాయి. మరి సింగిల్ సినిమా శ్రీవిష్ణు సక్సెస్ మేనియా కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈమధ్య సినిమాలు రిలీజ్ టైం లో ఎంత బాగా ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ ఆడియన్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి. అందుకే సింగిల్ టీం అదే ఫాలో అయ్యే ప్లానింగ్ లో ఉన్నారు.