రివ్యూ సిస్టమ్ పై శ్రీవిష్ణు.. క్రేజీ సజెషన్!
అయితే ప్రమోషన్స్ తో ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే సమయంలో రివ్యూల సిస్టమ్ పై శ్రీవిష్ణు మాట్లాడారు.
By: Tupaki Desk | 6 May 2025 10:15 AMటాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన టాలెంట్ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాతో మే9వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్నారు.
కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటించిన సింగిల్ మూవీ నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవ్వగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణు హిట్ కొట్టనున్నారని అంతా అంచనా వేశారు. అయితే ప్రమోషన్స్ తో ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే సమయంలో రివ్యూల సిస్టమ్ పై శ్రీవిష్ణు మాట్లాడారు.
సినిమా రివ్యూలను ఆపలేమని, మార్చలేమని వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి ఇండియన్ రూపీతోపాటు అన్నీ ఛేంజ్ అవుతున్నాయని తెలిపారు. తన ఏజ్ కూడా పెరిగిందని అన్నారు. అలాగే రేటింగ్స్ నంబర్స్ పెంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఐదు పాయింట్లకు బదులు 100కు పెంచితే బాగుంటుందని తెలిపారు.
క్రికెట్ మ్యాచ్ లాగా ఇది కూడా అనాలైసిస్సే కదా అని చెప్పారు శ్రీవిష్ణు. ఏదేమైనా రివ్యూల్లో చెప్పేది కొన్నిసార్లు కరెక్ట్ కావొచ్చని తెలిపారు. మరికొన్నిసార్లు కాకపోవచ్చని చెప్పారు. అందుకే రేటింగ్స్ నంబర్స్ పెంచాలని పేర్కొన్నారు. కాబట్టి ఒకసారి అలా ట్రై చేయాలని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఆ తర్వాత సింగిల్ మూవీ నేమ్ కు ముందు హ్యాష్ ట్యాగ్ ఉన్న కారణాన్ని వెల్లడించారు విష్ణు. సినిమా చూస్తే దాని కోసం ఫుల్ క్లారిటీ వస్తుందని తెలిపారు. సామజవరగమన సినిమా సమయంలోనే సింగిల్ మూవీ స్టోరీ తన వద్దకు వచ్చిందని చెప్పారు. దర్శకుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అని వెల్లడించారు.
కొన్ని నెలల పాటు వర్క్ చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారని వెల్లడించారు. అయితే ఆడియన్స్ ను అలరించాలనే ఉద్దేశంతో కొన్ని సోషల్ మీడియాలో వైరల్ మూమెంట్స్ ను రీక్రియేట్ చేశామని, కానీ ఓ సీన్ విషయంలో వివాదం నెలకొందని చెప్పారు. ఇతరులను కించపరచాలనే ఉద్దేశం ఏమాత్రం తమకు లేదని అన్నారు. ఆ వివాదాన్ని సాగదీయడానికి కూడా ఇష్టం లేదని తెలిపారు శ్రీవిష్ణు.