సమ్మర్ లో క్లిక్కయ్యేలా..శ్రీవిష్ణు 'సింగిల్' బజ్
సమ్మర్ హాలిడేస్ ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 6 May 2025 5:27 AMసమ్మర్ హాలిడేస్ ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా హిట్ 3తో నాని 100 కోట్లు కొట్టేశాడు. ఇక నెక్స్ట్ టాలీవుడ్‌లో కంటెంట్ కింగ్‌గా పేరున్న శ్రీ విష్ణు తన కొత్త సినిమా ‘సింగిల్’తో సమ్మర్ సీజన్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. మే 9 రిలీజ్ కానున్న ఈ ఎంటర్‌టైనర్ సినిమా సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. కార్తిక్ రాజు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.
విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో మ్యాజిక్ చేస్తూ, ‘సింగిల్’ సినిమాను హాట్ టాపిక్‌గా మార్చింది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ గురించి నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరి కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు.
అంతేకాదు, ఇన్‌సైడ్ రిపోర్ట్స్ కూడా సినిమా గురించి పాజిటివ్ వైబ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నాయి. ఈ సినిమా సమ్మర్ సీజన్‌కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ అవుతుందని, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సినిమా ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా ఇచ్చిన ఇంటర్వ్యూలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
ముఖ్యంగా శ్రీ విష్ణు తన సినిమాల్లో కంటెంట్‌కు ఎలా ప్రాధాన్యత ఇస్తాడో, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంపై ఎలా ఫోకస్ చేస్తాడో చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అతని కమిట్‌మెంట్, నిజాయితీ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ ఇంటర్వ్యూలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ‘సింగిల్’ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రావడంతో, దీని రిపీట్ వాల్యూ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ గురించి హైలైట్ అవుతోంది.
ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌లు ఆడియన్స్‌ను ఆకర్షించాయి. సినిమాలో శ్రీ విష్ణు డ్యూయల్ పర్సనాలిటీ రోల్‌లో కనిపించనున్నాడు. అలాగే వెన్నెల కిషోర్ కామెడీ, కేతిక శర్మ, ఇవానా రొమాన్స్ సినిమాకు బలంగా నిలుస్తాయని అంటున్నారు. మొత్తంగా, ‘సింగిల్’ సినిమా సమ్మర్ సీజన్‌లో మెగా బ్లాక్‌బస్టర్ అవుతుందని అంచనాలు నెలకొన్నాయి. మరి కలెక్షన్స్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.