శ్రీవిష్ణు ‘సింగిల్’ సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే?
సెన్సార్ బోర్డ్ నుంచి ‘సింగిల్’ సినిమా U/A సర్టిఫికేట్ పొందింది, రన్‌టైం 2 గంటల 5 నిమిషాలుగా నిర్ణయించారు.
By: Tupaki Desk | 8 May 2025 7:39 AMటాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తనదైన కంటెంట్ డ్రివెన్ సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. ‘సామజవరగమన’ వంటి హిట్ తర్వాత, ఇప్పుడు ‘సింగిల్’ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా సెన్సార్ రిపోర్ట్‌లు బయటకు వచ్చాయి, ఇవి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సెన్సార్ బోర్డ్ నుంచి ‘సింగిల్’ సినిమా U/A సర్టిఫికేట్ పొందింది, రన్‌టైం 2 గంటల 5 నిమిషాలుగా నిర్ణయించారు. ఈ రన్‌టైం ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌కు సరిగ్గా సరిపోతుందని రిపోర్ట్‌లు సూచిస్తున్నాయి. సినిమా మొదటి నుంచి చివరి వరకు కామెడీ సీన్స్ తో నిండి ఉంటుందని, ముఖ్యంగా మెట్రో ట్రైన్ ఎపిసోడ్‌లు, వెన్నెల కిషోర్-శ్రీవిష్ణు సన్నివేశాలు, VTV గణేష్ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.
సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, సినిమా లైట్ హార్టెడ్ టోన్‌లో సాగుతూ, క్లైమాక్స్‌లో డిఫరెంట్ ట్విస్ట్‌తో ముగుస్తుందట. ఇవానా, కేతికా శర్మ నటన కామెడీ టోన్‌కు అదనపు ఆకర్షణగా నిలిచిందని, డైలాగ్‌లు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తో ఉన్నాయని సమాచారం. దర్శకుడు కార్తీక్ రాజు కథ నుంచి వైదొలగకుండా, అన్ని పాత్రలను సమన్వయంతో చూపించి, ఫన్ బ్లాక్‌బస్టర్‌గా తీర్చిదిద్దాడని రిపోర్ట్‌లు చెబుతున్నాయి.
ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తుందని, థియేటర్లలో చాలా కాలం తరువాత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుందని తెలుస్తోంది. విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా, అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు నుంచి మరో ఫుల్ ఎంటర్‌టైనర్ అని రిపోర్ట్‌లు సూచిస్తున్నాయి.
సమ్మర్ సీజన్‌లో ‘సింగిల్’ సినిమా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్‌తో మరోసారి అలరిస్తాడని, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతుందని చెబుతున్నారు. మరి సినిమా ప్రమోషన్ కంటెంట్ తో క్రియేట్ చేసిన పాజిటివ్ వైబ్ ను థియేటర్స్ లో ఎంతవరకు కొనసాగిస్తుందో చూడాలి.