Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ను శ్రీ‌విష్ణు ఫాలో అవుతున్న‌ట్టుగా ఉందే!

శ్రీ‌విష్ణు సైలెంట్‌గా సినిమాలు చేస్తూ త‌న‌దైన మార్కు కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌తో స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   13 May 2025 12:30 PM
ప‌వ‌న్‌ను శ్రీ‌విష్ణు ఫాలో అవుతున్న‌ట్టుగా ఉందే!
X

శ్రీ‌విష్ణు సైలెంట్‌గా సినిమాలు చేస్తూ త‌న‌దైన మార్కు కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌తో స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకుంటున్నారు. 2023లో `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌`తో హిట్‌ని అందుకున్న శ్రీ‌విష్ణు మ‌న‌సుప‌డి చేసిన `స్వాగ్‌`తో బిగ్ షాక్ ఎదుర్కున్న విష‌యం తెలిసిందే. క‌మ‌ల్ ద‌శావ‌తారం త‌ర‌హాలో పంచావ‌తారం అన్న‌ట్టుగా ఐదు వేషాల్లో న‌టించాడు. అయితే ప్రేక్ష‌కుడిని క‌న్ఫ్యూజ‌న్‌కు గురి చేయ‌డంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది.

క‌ష్ట‌ప‌డి ఐదు క్యారెక్ట‌ర్లు చేస్తే ఆ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరై షాక్ ఇచ్చింది. దీని త‌రువాత శ్రీ‌విష్ణు చేసిన మూవీ `#సింగిల్‌`. కార్తీక్ రాజు డైరెక్ష‌న్‌లో క‌ల్యా ఫిల్మ్స్‌తో క‌లిసి గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మించింది. కేతిక శ‌ర్మ‌, `ల‌వ్ టుడే` ఫేమ్ ఇవాన హీరోయిన్‌లుగా న‌టించిన ఈ మూవీ రీసెంట్‌గా విడుద‌లై సూప‌ర్ హిట్ అనిపించుకుంది. వెన్నెల కిషోర్ కామెడీ, శ్రీ‌విష్ణు న‌ట‌న ఈ మూవీకి ప్ర‌ధాన బ‌లంగా నిలిచి స‌క్సెస్‌కు బాట‌లు వేశాయి. మే 9న విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అనూహ్య వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ దూసుకుపోతోంది.

రూ.7 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఆ టార్గెట్‌ని విడుద‌లైన మూడు రోజుల్లోనే అధిగ‌మించి ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇచ్చింది. వీకెండ్‌లో రూ.15 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి హీరో శ్రీ‌విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ స్పీడు చూస్తుంటే రానున్న రోజుల్లో రూ.50 కోట్ల‌కు మించి రాబ‌ట్టినా ఆశ్చ‌ర్యం లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ మూవీలో శ్రీ‌విష్ణు డైలాగ్ డెలివ‌రీ, బాడీ లాంగ్వేజ్‌పై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌ని శ్రీ‌విష్ణు ఫాలో అవుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని అంతా అంటున్నారు. #సింగిల్స్` మూవీలో హీరోయిన్‌ల‌తో, వెన్నెల కిషోర్‌లో ఎక్కువ సీన్‌లున్నాయి. ఆ సీన్‌ల‌లో శ్రీ‌విష్ణు ప‌లికించిన హావ‌భావాలు బ‌ద్రి, త‌మ్ముడు సినిమాల స‌మ‌యంలో ప‌వ‌న్ ప‌లికించిన హావ భావాలు, డైలాగ్ డెలివ‌రీని గుర్తు చేశాయ‌ని అంతా అంటున్నారు. ఇదే ఫాలో అయితే శ్రీ‌విష్ణు కెరీర్ మ‌రో లెవెల్‌కు వెళుతుంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.