'సింగిల్' బాక్సాఫీస్.. మొదటి రోజే సెన్సేషనల్ కలెక్షన్స్
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది.
By: Tupaki Desk | 10 May 2025 11:40 AM ISTశ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ రైడ్ రిలీజ్ అయిన మొదటి రోజే 4.15 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అల్లూ అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కాల్యా ఫిలింస్ బ్యానర్లపై వచ్చిన ఈ సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ కనిపించింది.
టీజర్స్, ట్రైలర్స్ నుంచే ఈ సినిమా అంచనాలను పెంచింది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యంగ్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సిటీ ఆడియన్స్ లోనే కాకుండా, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే రికార్డ్ అయ్యాయి.
బుక్‌మైషోలో 24 గంటల్లో 50,000కు పైగా టిక్కెట్లు అమ్ముడవ్వడం, డే 2లో కూడా ఇదే జోరు కొనసాగడం చూస్తే వీకెండ్లో మరింత పెద్ద నంబర్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆదివారం కలెక్షన్లు ఎక్కువయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే, ఈ సినిమా మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంటూ, అన్ని కేంద్రాల్లో మంచి ఆక్యుపెన్సీని సాధిస్తోంది.
ఈ సమయంలో, థియేట్రికల్ మార్కెట్ సంక్లిష్టంగా ఉన్నా కూడా ‘సింగిల్’ కేవలం పాజిటివ్ మౌత్ టాక్, ఫన్ ఫుల్ కంటెంట్, ఆకర్షణీయమైన పెర్ఫార్మెన్స్లతోనే ఈ స్థాయిలో రాణించడం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతం, విభిన్న స్క్రీన్‌ప్లే కూడా సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. ముఖ్యంగా లైట్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకీ, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్‌కీ ఈ సినిమా కిక్కిచ్చేసింది.
ఈమధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తం కలిసి చూసే సినిమాలు అంతగా క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు సింగిల్ మూవీ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక శ్రీవిష్ణు కంటెంట్ కింగ్ అని మరోసారి నిరూపించాడు. సమ్మర్ లో పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలు కూడా లేకపోవడంతో సినిమా వీకెండ్ తరువాత కూడా హాలిడేస్ ను యూజ్ చేసుకునే అవకాశం ఉంది.