Begin typing your search above and press return to search.

'సింగిల్' బాక్సాఫీస్.. లెక్క ఎంతవరకు వచ్చిందంటే?

సినిమా సినిమాకు డిఫరెంట్ కాంటెంట్ తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న శ్రీవిష్ణు కామేడి ట్రాక్ ను అసలు మారువడం లేదు.

By:  Tupaki Desk   |   12 May 2025 6:25 AM
Sree Vishnu Single Movie 3 days Collections
X

సినిమా సినిమాకు డిఫరెంట్ కాంటెంట్ తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న శ్రీవిష్ణు కామేడి ట్రాక్ ను అసలు మారువడం లేదు. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గ కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ తో మరోసారి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్ బాట పట్టింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు మూడు రోజుల్లోనే 16.3 కోట్ల గ్రాస్‌ను రాబట్టి ట్రేడ్ వర్గాల అంచనాలకు మించిన ప్రదర్శన చూపుతోంది.


ఆదివారం ఒక్కరోజే ఈ మూవీ 5.1 కోట్ల గ్రాస్‌ను రాబట్టడం విశేషం. శ్రీ విష్ణు గురించి ప్రత్యేకతగా చెప్పుకోవలసిన విషయం అతని కామెడీ టైమింగ్. ఈ సినిమాలోనూ అదే మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయింది. థియేటర్‌లో కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే టాలెంట్ శ్రీ విష్ణుకి మాత్రమే సొంతం అనిపిస్తోంది. యువత నుంచి పెద్దలవరకూ ఈ సినిమా మంచి ఆదరణ పొందుతోంది.

వీకెండ్ ముగిసేలోపు అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వెళ్లిన ఈ సినిమా, నిర్మాతలకు భారీగా లాభాల బాట పట్టించింది. ఇక బుక్ మై షో లాంటి టికెట్ ప్లాట్‌ఫామ్స్‌లో ‘సింగిల్’ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క రోజులోనే 66,000 పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. మొత్తంగా మూడు రోజుల్లో 2 లక్షల టికెట్ మార్కును దాటి కొత్త రికార్డు నమోదు చేసింది.

ఇదే ట్రెండ్ కొనసాగితే వచ్చే వారం చివరినల్లా ఈ సినిమా 20 కోట్లు దాటి మంచి ప్రాఫీట్స్ సొంతం చేసుకునే అవకాశముంది. విదేశాల్లో కూడా శ్రీ విష్ణు సినిమాకు బలమైన మార్కెట్ ఉండడం ఇప్పుడే స్పష్టమవుతోంది. అమెరికాలో ఇప్పటికే $400K మార్కును దాటి హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తోంది. ఇది శ్రీ విష్ణు సినిమాల గ్రాఫ్‌ను భారీగా పెంచే పరిణామంగా మారుతోంది.

యువ కథానాయకుల్లో కమర్షియల్ విజయాలను అందుకుంటూ, క్రెడిబులిటీని నిలబెట్టుకుంటున్న నటుల్లో శ్రీ విష్ణు ముందున్నాడు అనేలా ఈ సినిమాతో చాటాడు. కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో రూపొందించారు. ఎంటర్టైన్‌మెంట్, ఎమోషన్స్ తో కొత్తగా ఎట్రాక్ట్ చేస్తున్న ఈ చిత్రం, ఈ వేసవి సీజన్‌లో నిజమైన బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటోంది. ఇక వీకెండ్ అనంతరం ఇంకా ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.