సూపర్‌హిట్ కాంబోలో మరో సినిమా
సినిమా సినిమాకీ కొత్తదనాన్ని అందిస్తూ, ఆడియన్స్ ను మెప్పించడానికి ప్రయత్నించే హీరోల్లో శ్రీ విష్ణు కూడా ఒకరు.
By: Tupaki Desk | 10 July 2025 10:38 AM ISTసినిమా సినిమాకీ కొత్తదనాన్ని అందిస్తూ, ఆడియన్స్ ను మెప్పించడానికి ప్రయత్నించే హీరోల్లో శ్రీ విష్ణు కూడా ఒకరు. ప్రతీసారి డిఫరెంట్ స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచే శ్రీవిష్ణు తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే శ్రీవిష్ణు కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన సినిమాల్లో సామజవరగమన ముందుంటుంది.
సామజవరగమన సినిమాలోని కామెడీ ప్రతీ ఒక్కరినీ కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాకు వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సామజవరగమన హిట్ తర్వాత రామ్ అబ్బరాజు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తో నారీ నారీ నడుమ మురారి సినిమా చేస్తున్నారు. కానీ ఆ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల లేటవుతూ వస్తుంది.
దీంతో డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఇప్పుడు తన తర్వాతి సినిమాపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తన బ్లాక్ బస్టర్ మూవీ సామజవరగమన హీరో శ్రీ విష్ణు కోసం ఓ హిలేరియస్ స్క్రిప్ట్ ను నెరేట్ చేసి ఆయనతో ఓకే చేయించుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో పాటూ సామజవరగమనకు వర్క్ చేసిన రైటర్స్ భాను, నందు కూడా ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని సమాచారం.
వచ్చే ఏడాది మొదలవనున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. మొన్నీ మధ్యే సింగిల్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న శ్రీ విష్ణు చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ఈ ఏడాది ఆ రెండు సినిమాలను పూర్తి చేసి నెక్ట్స్ ఇయర్ రామ్ అబ్బరాజుతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు శ్రీ విష్ణు.
