Begin typing your search above and press return to search.

'మృత్యుంజయ్' డబుల్ క్లాష్ ఎలా తప్పించుకుంది?

ఓటీటీ డీల్ వల్ల సాటిస్ఫై అయ్యారన్న టాక్ వచ్చింది అది నిజమేనా అని మీడియా ప్రతినిధి అడగ్గా.. ఓటీటీ తమకు మంచి డీల్ ఇచ్చిందని తెలిపారు.

By:  M Prashanth   |   7 March 2026 10:17 PM IST
మృత్యుంజయ్ డబుల్ క్లాష్ ఎలా తప్పించుకుంది?
X

టాలీవుడ్ యంగ్ హీరో లీడ్ రోల్ లో నటించిన మృత్యుంజయ్ మూవీ.. రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుని సందడి చేస్తోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా.. మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే ఆ సినిమాను ముందు ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

కానీ అదే రోజు విష్ణు నటించిన మరో మూవీ విష్ణు విన్యాసం కూడా రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అలా రెండు సినిమాలు ఒకే రోజు వచ్చేందుకు షెడ్యూల్ చేసుకున్నాయి. రెండు వేర్వేరు జోనర్లలో రూపొందిన సినిమాలు అయినప్పటికీ.. ఒకేసారి విడుదలైతే కచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో ఏదో ఒకటి డ్రాప్ అయితే బెటర్ అని అంతా అనుకున్నారు.

చివరికి మృత్యుంజయ్ మూవీ వెనక్కి తగ్గి.. మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే డబుల్ క్లాష్ కు మెయిన్ రీజన్.. ఓటీటీలేనని అప్పట్లో టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ఓటీటీనే డ్రాప్ అయ్యేందుకు ఛాన్స్ ఇచ్చిందని మృత్యుంజయ్ మూవీ నిర్మాత సందీప్ గుణ్ణం తెలిపారు. తాజాగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. అందులో ఓటీటీ డీల్ కోసం మాట్లాడుతూ ఆ విషయాన్ని రివీల్ చేశారు.

ఓటీటీ డీల్ వల్ల సాటిస్ఫై అయ్యారన్న టాక్ వచ్చింది అది నిజమేనా అని మీడియా ప్రతినిధి అడగ్గా.. ఓటీటీ తమకు మంచి డీల్ ఇచ్చిందని తెలిపారు. రెండు సినిమాలు ఒకే రోజు వస్తాయేమో అని టెన్షన్ పడుతున్నప్పుడు.. ఒక ప్రొడ్యూసర్ గా వెనక్కి తగ్గకూడదనుకున్నప్పుడు.. నెట్‌ ఫ్లిక్స్ వాళ్ళే నిజమైన పార్టనర్ లా ముందుకు వచ్చారని చెప్పారు. డ్రాప్ అవ్వడం కరెక్ట్ కాదని తమకు తెలుసని అన్నారు.

కానీ వెనక్కి వెళ్లే ఛాన్స్ ఇస్తున్నామని, పోస్ట్‌ పోన్ చేసుకునే అవకాశం ఇస్తున్నామని చెప్పినట్లు తెలిపారు. అలా అని మృత్యుంజయ్ సినిమా మూడు వారాలకే ఓటీటీలోకి రాదని క్లారిటీ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ రూల్స్ ప్రకారం నెల రోజులకు రానుందని చెప్పారు. ఇప్పటికే టెలికాస్ట్ డేట్ కూడా ఫిక్స్ అయిందని వెల్లడించారు. థియేటర్స్ లో మంచి ఆరంభం అందుకుందని సందీప్ గుణ్ణం చెప్పారు.

అంతకు ముందు మాట్లాడుతూ.. రెండేళ్ల ప్రయాణం తర్వాత మృత్యుంజయ్ కథ ఓకే అయిందని చెప్పారు. రిలీజ్ కు ముందు ప్రొడక్ట్ చూసి బాగుందని అనుకున్నామని, కానీ ఆడియన్స్ మాత్రం అద్భుతంగా ఉందని చెబుతున్నారని అన్నారు. తనను నమ్మి మూవీని చేసిన శ్రీ విష్ణుకు థాంక్స్ చెప్పారు. సండే ఫైనల్ మ్యాచ్‌ లో గెలుస్తామని, ఆ తర్వాత మండే నుంచి సినిమా చూడాలని కోరారు.