Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు 'మృత్యుంజయ్'.. సెకెండ్ వీకెండ్ ఎలా ఉంది?

తెలుగు ప్రేక్షకులను థ్రిల్లింగ్ స్టోరీతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ మూవీ రెండో వీకెండ్‌ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

By:  M Prashanth   |   16 March 2026 3:40 PM IST
శ్రీవిష్ణు మృత్యుంజయ్.. సెకెండ్ వీకెండ్ ఎలా ఉంది?
X

తెలుగు ప్రేక్షకులను థ్రిల్లింగ్ స్టోరీతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ మూవీ రెండో వీకెండ్‌ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. యాక్షన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్టేబుల్ గా కొనసాగుతూ సాలిడ్ కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా బుక్‌ మైషోలో టికెట్ బుకింగ్స్ పెరగడం.. ట్రెండింగ్ లో ఉండడం.. సినిమాకు వస్తున్న ఆదరణ చూపిస్తోంది.




గత 24 గంటల్లోనే బుక్‌ మైషోలో మృత్యుంజయ్ కు 7 వేలకు పైగా టికెట్లు బుక్ కావడం గమనార్హం. రెండో వీక్ లో కూడా సినిమా బుకింగ్స్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్నాయని ఆ మూవీ మేకర్స్ వెల్లడించారు. బ్లాక్‌ బస్టర్ మొమెంటమ్ మరింత స్ట్రాంగ్ గా మారుతుందంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

అయితే శ్రీ విష్ణు నటించిన రెండు చిత్రాలు వారం గ్యాప్ లోనే థియేటర్లలోకి వచ్చినప్పటికీ మృత్యుంజయ్ కు మంచి రెస్పాన్స్ వస్తుండడం విశేషం. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరిగి సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. అదే సమయంలో సోమవారం నుంచి వర్కింగ్ డేస్ ప్రారంభమవడం, తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ కొనసాగడం వంటి కారణాలతో వసూళ్లు కొంతమేర తగ్గినట్లు సమాచారం.

అయినప్పటికీ ఫస్ట్ షో, సెకండ్ షోలకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా పోటీ లేకపోవడం కూడా మృత్యుంజయ్ మూవీ అనుకూలంగా మారింది. దీంతో రెండో వీకెండ్‌ లో కూడా మృత్యుంజయ్ మరోసారి తన సత్తా చాటిందనే చెప్పాలి. ఇక సినిమాలో శ్రీవిష్ణు సరనస రెబా మోనికా జాన్ యాక్ట్ చేశారు.

కీలక పాత్రల్లో రచ్చ రవి, మిర్చి మాధవి, సుదర్శన్, క్రిష్ణ కౌశిక్ తదితరులు నటించారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన మృత్యుంజయ్ సినిమాను లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై నిర్మాతలు సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించారు. సంగీతాన్ని కాలభైరవ అందించారు. సినిమాటోగ్రఫీని విద్యాసాగర్ చింతా నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలను శ్రీకర్ ప్రసాద్ చేపట్టారు.

మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ చిత్రానికి సుమారు రూ.14 కోట్ల బడ్జెట్ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు సినిమాను రూపొందించినట్లు టాక్. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్, డబ్బింగ్ హక్కుల ద్వారా నిర్మాతలు మంచి ఆదాయం పొందినట్లు వినికిడి. ఆ హక్కుల ద్వారా వచ్చిన మొత్తంతో సినిమా బడ్జెట్‌ కు మించి వసూళ్లు రావడంతో నిర్మాతలు ఇప్పటికే లాభాల్లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే రాబోయే రోజుల్లో మృత్యుంజయ్ మరిన్ని కలెక్షన్స్ సాధించనుందని అర్థమవుతోంది.