ఇవానాతో యంగ్ హీరో లిప్ కిస్!
అయితే 'సింగిల్' సినిమా కోసం శ్రీవిష్ణు రూల్స్ బ్రేక్ చేసినట్లు వినిపిస్తుంది.
By: Tupaki Desk | 7 May 2025 7:00 AMయంగ్ హీరో శ్రీవిష్ణు సినిమాలంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఆయన అన్నీ డిసెంట్ సినిమా లు..పాత్రలే పోషిస్తుంటాడు. హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలు...పెదవి ముద్దులు...ఇంటిమేట్ సన్నివేశాలు లాంటివి ఉండవు. కథని నమ్మి సినిమా చేస్తాడు తప్ప అందులో అసభ్యత కొరుకోడు. ఇప్పటి వరకూ శ్రీవిష్ణు సినిమాలు చూస్తే ఈ సంగతి క్లియర్ గా అర్దమవుతుంది.
అయితే 'సింగిల్' సినిమా కోసం శ్రీవిష్ణు రూల్స్ బ్రేక్ చేసినట్లు వినిపిస్తుంది. శ్రీవిష్ణు హీరోగా 'సింగిల్' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో ఇవానా, కేతిక శర్మ నాయికలుగా నటించారు. ఆద్యంతం వినో దాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. అయితే ఇందులో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకు దర్శకుడు ఛాన్స్ తీసుకన్నాడట. దీనిలో భాగంగా ఓ సన్నివేశంలో ఇవానా- శ్రీవిష్ణు మధ్య గాఢమైన పెదవి ముద్దు సన్ని వేశం ఒకటుందట.
అక్కడ సీన్ డిమాండ్ చేయడంతో ఈ ముద్దు సన్నివేశం పెట్టినట్లు వినిపిస్తుంది. ఇదే నిజమైతే థియేటర్లో కాక మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆ ముద్దు సన్నివేశలో నటించింది ఇవానా? ఆమెకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇవానా అంటే తెలుగు కుర్రాళ్లు అసాధారణమైన అభిమానం చూపిస్తారు. 'లవ్ టుడే' అనే డబ్బింగ్ సినిమాతోనే ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఏర్పడింది.
అందులో డబుల్ మీనింగ్ డైలాగులు... బూతు సంభాషణలతో అమ్మడు బాగా దగ్గరైంది. అలాంటి బ్యూటీ పెదవి ముద్దులో నటించిందంటే? థియేటర్లలో అల్లకల్లొలం జరిగిపోదు. ఇవానాకున్న ఈ ఫాలోయింగ్ని ఎన్ క్యాష్ చేసుకుందామనే దర్శకుడు ఇలా ప్లాన్ చేసాడా? ఏంటి? మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.