ఛాన్సు లేకపోయినా శ్రీలీల అదే క్రేజ్!
'గుంటూరు కారం' తర్వాత శ్రీలీలకు హీరోయిన్ గా మరో హిట్ లేదు. అటుపై రిలీజ్ అయిన 'రాబిన్ హుడ్' తో వైఫల్యం తప్పలేదు.
By: Tupaki Desk | 30 Jun 2025 4:00 AM IST`గుంటూరు కారం` తర్వాత శ్రీలీలకు హీరోయిన్ గా మరో హిట్ లేదు. అటుపై రిలీజ్ అయిన `రాబిన్ హుడ్` తో వైఫల్యం తప్పలేదు. `పుష్ప-2` లో కిసిక్ పాటతో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. ఈ క్రేజ్ తోనే అమ్మడు టాలీవుడ్ లో ఇంకా అటెన్షన్ డ్రా చేస్తుంది. చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినా క్రేజీ బ్యూటీ వైరల్ అవుతుందంటే కారణం కిసిక్ సాంగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
`మాస్ జాతర`, `ఉస్తాద్ భగంత్ సింగ్` చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు మినహా కొత్త అవకాశాలు అమ్మడికి రాలేదు. వచ్చిన అవకాశాలను కాదనుకుంటుంది. అయితే అమ్మడు మనసంతా బాలీవుడ్ పై ఉంది. ఇప్ప టికే అక్కడ కొన్ని సినిమాలకు కమిట్ అయింది. `ఆషీకి-3` సహా మరో చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళ్ లోనూ కొన్ని కథలు విన్నట్లు ప్రచారం జరుగుతుంది.
మరి సొంత భాషలో వచ్చిన `లెనిన్` అవకాశాన్ని ఎందుకు వదులుకున్నట్లు? అంటే సరైన కారణం మాత్రం బయటకు రాలేదు. డేట్లు సర్దుబాటు కాక వదులుకున్నట్లు ఓ వైపు ప్రచారం జరుగుతుంటే శ్రీలీల తల్లి బాలీ వుడ్ సినిమాలు చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తుందనే వార్త వినిపిస్తుంది. తెలుగు కంటే ఇతర భాషలే ఉత్త మంగా మామ్ భావిస్తోందట. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.
సాధారణంగా ఓ నటి సొంత భాషలో వస్తోన్న అవకాశాలు వదిలేసి ఇతర భాషలకు వెళ్తే నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. కానీ శ్రీలీల విషయంలో ఎలాంటి నెగిటిటీ తెరపైకి రాలేదు. ఆరకంగా శ్రీలీలకు పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. తెలుగులో అమ్మడికి మంచి ప్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే.
