శ్రీలీల ఎందుకు ఇలా చేస్తుంది ?
శ్రీలీల తల్లి చాటు బిడ్డ. కూతురంటే ఎంత గారబమో! కోపం వస్తే శివంగిలా మారిపోతుందని కొన్ని ఫన్నీ వీడియోలు చూస్తేనే వాళ్లిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉందన్నది అర్దమవుతుంది.
By: Tupaki Desk | 25 Jun 2025 11:22 AM ISTశ్రీలీల తల్లి చాటు బిడ్డ. కూతురంటే ఎంత గారబమో! కోపం వస్తే శివంగిలా మారిపోతుందని కొన్ని ఫన్నీ వీడియోలు చూస్తేనే వాళ్లిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉందన్నది అర్దమవుతుంది. అమ్మ మాటను శ్రీలీ జవదాటదు. శ్రీలీలను హీరోయిన్ ని చేసింది కూడా తల్లే. అమ్మ ప్రణాళిక ప్రకారం శ్రీలీల నడుచుకోవడంతోనే నేడు ఈ స్థానంలో ఉంది. చిన్నప్పుడే డాన్సింగ్ పై స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించింది.
అటుపై క్లాసికల్ డాన్స్ సహా రకరకాల డాన్సులను ఆ వయసులోనే అవపోశాన పట్టేసింది. నటిగా అవసర మైన ట్రైనింగ్ లన్నీ ఇప్పించింది మామ్. వెండి తెరపై హీరోయిన్ గా చూసుకుని ఎంతో మురిసి పోతుంది ఆ తల్లి. తాను సాధించలేనిది కుమార్తె రూపంలో సాధించిందా? అన్న సందేహం వచ్చేస్తుంది ఒక్కోసారి. అంతగా తల్లి ప్రభావం శ్రీలీలపై ఉంది. శ్రీలీలను తానే స్వయంగ హీరోయిన్ ని చేసింది. ఇది నిజంగా గొప్ప విషయమే. సినిమా అంటే రకర కాల అపోహలుంటాయి. వాటి వేటిని పట్టించుకోకుండా స్వర్ణలత కుమార్తెను ముందుకు నడిపించారు.
అలా శ్రీలీల కెరీర్ లో మామ్ కీ రోల్ పోషించారు. ఇండస్ట్రీలో ఇలాంటి గైడెన్స్ ఎంతో పనికొస్తుంది. బాలీవుడ్ లో జాన్వీ కపూర్ ను కూడా ఇలాగే డాడ్ బోనీ కపూర్ వెనుకుండి నడిపిస్తున్నాడు. టాలీవుడ్ లో తరుణ్ ఫాంలో ఉన్నం కాలం మామ్ రోజా రమణి గైడెన్స్ తోనే అంత పెద్ద స్టార్ అయ్యాడని అంటారు.కెరీర్ పట్టాలు తప్పడానికి కారణం కూడా ఆమె కారణంగా అప్పట్లో వార్తలొచ్చాయి. తాజా గా శ్రీలీల అఖిల్ హీరోగా నటిస్తోన్న 'లెనిన్' సినిమా నుంచి తప్పుకుందనే వార్తలొస్తున్నాయి. అందుకు కారణం శ్రీలీల తల్లి పేరు తెర పైకి వస్తోంది.
శ్రీలీలకు టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇతర భాషల్లో నే మంచి కెరీర్ ఉంటుందని భావించి ఆ దిశగా మూవ్ చేస్తున్నారని వినిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. తెలుగు అమ్మాయిలకు తెలుగు నిర్మాతలు అవకాశాలివ్వరు అనే ఆరోపణ చాలా కాలంగా ఉంది. కానీ శ్రీలీల విషయంలో ఇది తప్పే. శ్రీలీలకు కొన్ని మంచి అవకాశాలు కల్పించింది అన్నది వాస్తవం. ప్రస్తుతం చేతిలో కొన్ని తెలుగు సినిమా లున్నాయి. కానీ శ్రీలీల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే హిందీ , తమిళ చిత్రాల వైపు ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది.
